AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Invitation to Army: మీ వల్లే ఈ సంతోషం.. మా పెళ్లికి తప్పక రావాలి.. ఇండియన్ ఆర్మీకి ఆహ్వానం పంపిన జంట..

ఎవరైనా అమ్మాయి, అబ్బాయి అయినా తమ పెళ్లిన ఎంతో ఘనంగా జరుపుకోవాలని కలలు కంటారు. తమ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి, అందరి సమక్షంలో..

Invitation to Army: మీ వల్లే ఈ సంతోషం.. మా పెళ్లికి తప్పక రావాలి.. ఇండియన్ ఆర్మీకి ఆహ్వానం పంపిన జంట..
Kerala Couple Invitation
Shiva Prajapati
|

Updated on: Nov 20, 2022 | 11:59 AM

Share

ఎవరైనా అమ్మాయి, అబ్బాయి అయినా తమ పెళ్లిన ఎంతో ఘనంగా జరుపుకోవాలని కలలు కంటారు. తమ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి, అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలని భావిస్తారు. ఆ మేరకు వధు వరుల కుటుంబ సభ్యులు కూడా ఆహ్వాన పత్రికలు అచ్చు వేయించి బంధుమిత్రులందరికీ ఆహ్వానం పంపుతారు. అయితే, కేరళకు చెందిన ఓ జంట పంపిన ఇన్విటేషన్.. యావత్ దేశాన్ని తమవైపు తిప్పుకునేలా చేసింది. అవును, ఎవరైనా సరే తమ సన్నిహితులు, పరిచయం ఉన్న స్నేహితులు, బంధువులకు ఆహ్వానాలు పంపడం ఇప్పటి వరకు మనం చూశాం. ఈ జంట మాత్రం, దేశంలో తాము ఇలా సంతోషంగా ఉండటానికి కారణం మీరే అంటూ ఇండియన్ ఆర్మీని తమ పెళ్లికి ఆహ్వానించింది. ‘మీ వల్లే మేం సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాం. మా పెళ్లికి మీరంతా తప్పకుండా రావాలి’ అంటూ కేరళకు చెందిన ఓ జంట ఆహ్వాన లేఖ పంపింది. ఈ ఇన్విటేషన్‌ను ఇండియన్ ఆర్మీ అధికారిక ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

నవంబర్ 10, 2022 న వివాహం చేసుకున్న రాహుల్, కార్తీక దంపతులు తమ వివాహ ఆహ్వాన పత్రికను చేతితో రాసిన ఒక నోట్‌తో పాటు భారత సైన్యానికి పంపారు. ‘మేము.. రాహుల్, కార్తీక. నవంబర్ 10వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాం. దేశం పట్ల మీకున్న ప్రేమ, దృఢ సంకల్పం, నిజమైన దేశ భక్తికి మేము కృతజ్ఞులం. మేం ఇక్కడ సురక్షితంగా ఉండేందుకు కారణమైన మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. మా ప్రియమైన వారితో మాకు సంతోషకరమైన రోజులను అందించినందుకు ధన్యవాదాలు. మీ వల్లే ఇవాళ మేం సంతోషంగా పెళ్లి చేసుకోబోతున్నాం. జీవితంలో ఎంతో ప్రత్యేకమైన మా వివాహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. మా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. మమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తున్నందుకు ధన్యవాదాలు.’’ అని కేరళకు చెందిన ఈ జంట వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను పంపింది.

ఇవి కూడా చదవండి

ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ఇండియన్ ఆర్మీ అధికారిక ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ‘‘వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిన రాహుల్, కార్తీక లకు ఇండియన్ ఆర్మీ తరఫున శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ దంపతుల వైవాహిక జీవితం సంతోషంగా, ఆనందంగా సాగాలని కోరుకుంటుంది.’’ అని ఇండియన్ ఆర్మీ ఇన్‌స్టాగ్రమ్‌లో క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్‌‌కు ఇప్పటి వరకు 99 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దీనికి నెటిజన్ల నుంచి అంతే మంచి రెస్పాండ్స్ వస్తోంది. కేరళ జంటను అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో నిజమైన హీరోలకు ప్రజలు అందించిన అద్భుత గౌరవం అంటూ కొనియాడుతున్నారు. ఇది అత్యుత్తమ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని మరికొందరు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్