AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ridge Gourd Benefits: బీరకాయతో బోలెడు ప్రయోజనాలు.. ఇలా చేస్తే ఎంతటి జ్వరమైనా పరార్..!

బీరకాయ తెలియని వారు ఎవరూ ఉండరు. మనం రోజూ తీసుకునే ఆహారాల్లో బీరకాయ కూడా ఒకటి. చాలా మంది బీరకాయ తినడానికి ఇష్టపడుతారు.

Ridge Gourd Benefits: బీరకాయతో బోలెడు ప్రయోజనాలు.. ఇలా చేస్తే ఎంతటి జ్వరమైనా పరార్..!
Ridge Gourd Benefits
Shiva Prajapati
|

Updated on: Nov 19, 2022 | 2:19 PM

Share

బీరకాయ తెలియని వారు ఎవరూ ఉండరు. మనం రోజూ తీసుకునే ఆహారాల్లో బీరకాయ కూడా ఒకటి. చాలా మంది బీరకాయ తినడానికి ఇష్టపడుతారు. బీరకాయతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు.. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. చికెన్ గున్యా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి జబ్బుల బారిన పడకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బీరకాయ. అంతేకాదు.. దీనిని సరైన రీతిలో తీసుకుంటే ఎలాంటి జ్వరమైన ఇట్టే తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే, ఈ బీరకాయలోని ఔషధ గుణాల ప్రయోజనం శరీరానికి పూర్తిగా అందాలంటే ఎలా తీసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

బీరకాయ జ్యూస్..

బీరకాయ, 100 గ్రాముల బెల్లం, సగం నిమ్మకాయ ముక్క, చిన్న గ్లాసు వాటర్‌తో కలిపి జ్యూస్ చేయాలి. జ్వరం వచ్చిన వారు ఆ జ్యూస్ కొంత నోటిలో వేసుకుని పుక్కిలించాలి. మిగతా జ్యూస్ తాగాలి. ఆ తరువాత అరగంట పాటు నిద్రపోతే జ్వరం తగ్గిపోతుంది. విపరీతమైన జ్వరం ఉంటే.. మూడు రోజుల పాటు ఇలా చేస్తే నయం అవుతుంది. బొడ్డుతాడులో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయో.. బీరకాయ గుజ్జులోనూ అంతే ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆఫీసు నుంచి వచ్చి అలిసిపోయినట్లుగా, టెన్షన్‌గా ఉన్నవారు ఈ జ్యూస్ తాగడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఎంత అలసిపోయినా పది నిమిషాల్లో సెట్ అవుతారు. అంతేకాదు.. నరాల బలహీనత ఉన్నవారు కూడా ఈ జ్యూస్ తాగితే చాలా ఎఫెక్టీవ్‌గా ఉంటుందని చెబుతున్నారు. జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది.

బీరకాయ ఇతర ప్రయోజనాలు..

1. బీరకాయలో పీచు పదార్థాలు, విటమిన్ సి, జింక్, ఐరన్, రైబోఫ్లావిన్, మెగ్నీషియం, థయామిన్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

2. ఇందులో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో సెల్యులోజ్, వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పైల్స్ సమస్యను నివారిస్తుంది.

3. మూత్రం, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించే పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ ఇన్సులిన్ కంటెంట్ బీరకాయలో ఉంటుంది.

4. రక్త శుద్ధిలో బీరకాయ అద్భుతంగా పని చేస్తుంది. కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆల్కహాల్ నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది.

5. కామెర్లను నయం చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయ పడుతుంది.

6. చర్మ సంరక్షణలోనూ అద్భుతంగా సహాయపడుతుంది. ఎసిడిటీ, అల్సర్‌ను తగ్గిస్తుంది.

7. కంటి వ్యాధులను నివారించే శక్తి దీనికి ఉంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, అంధత్వానికి దారితీసే కండరాల క్షీణతను నివారిస్తుంది.

గమనిక: వైద్యులు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ముందుగా వైద్యులను సంప్రదించడం ముఖ్యం. వారి సలహాల మేరకే నడుచుకోవాలి. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..