పెరుగుతో కలిపి పచ్చి మిరపకాయ తినే అలవాటు మీకూ ఉందా?
16 April 2025
TV9 Telugu
TV9 Telugu
పెరుగు ప్రతి ఇంట్లో వినియోగించే సూపర్ ఫుడ్. ముఖ్యంగా వేసవిలో పెరుగు వినియోగం ఎక్కువ. ఎండాకాలం కూరల కంటే కూడా పెరుగు నచ్చేస్తుంది. కానీ అది పుల్లగా ఉంటే తినాలనిపించదు. మరీ తియ్యగా ఉన్నా కష్టమే
TV9 Telugu
పెరుగులో ప్రోయబయాటిక్స్‌తోపాటు మంచి బ్యాక్టీరియా, కాల్షియం, భాస్వరం వంటి అంశాలు ఇందులో కనిపిస్తాయి. అయితే కొంతమందికి పెరుగులో పచ్చిమిర్చి తినే అలవాటు ఉంటుంది
TV9 Telugu
పెరుగులో పచ్చిమిర్చి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పచ్చి మిరపకాయలో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా లభిస్తాయి
TV9 Telugu
పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగులకు మంచిది. పచ్చి మిరపకాయల్లో క్యాప్సైసిన్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఈ రెండింటి కలయిక అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది
TV9 Telugu
పచ్చి మిరపకాయలను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. బరువును నియంత్రించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక
TV9 Telugu
అయితే పెరుగు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల జలుబు మరియు దగ్గుతో బాధపడేవారు దీనిని తినకపోవడమే మంచిది. పచ్చిమిర్చి జీవక్రియను వేగవంతం చేస్తుంది
TV9 Telugu
పెరుగులో ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రెండింటి కలయిక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చిమిర్చి శరీరానికి తేలికపాటి వేడిని తెస్తుంది. అయితే పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది
TV9 Telugu
ఈ రెండింటి కలయిక శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. పచ్చిమిర్చి కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పెరుగులో ప్రోటీన్ కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా అతిగా తినకుండా నిరోధించి, బరువును నియంత్రించుకోవడంలో సహాయపడుతుంది