AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజెక్షన్‌ అంటే భయమా.. అయితే మీకే ఈ గుడ్‌న్యూస్‌! నొప్పి, సూది లేని ఇంజెక్షన్‌ వచ్చేసింది!

ఇంజెక్షన్లకు భయపడేవారికి శుభవార్త! 'ఇంటెగ్రి మెడికల్' సంస్థ సూది లేని కొత్త ఇంజెక్షన్ 'ఎన్-ఫిస్'ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అధిక వేగంతో మందును చర్మం ద్వారా కండరాలకు చేరుస్తుంది, నొప్పి లేకుండా. వెయ్యికి పైగా వైద్యులు దీన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇంజెక్షన్‌ అంటే భయమా.. అయితే మీకే ఈ గుడ్‌న్యూస్‌! నొప్పి, సూది లేని ఇంజెక్షన్‌ వచ్చేసింది!
Needle Free Injection
SN Pasha
|

Updated on: Apr 16, 2025 | 3:57 PM

Share

కొంతమంది రెండు మూడు రోజులు జ్వరంతో బాధపడుతుంటారు, కానీ హాస్పిటల్‌కు వెళ్లరు. ఎందుకంటే.. డాక్టర్‌ ఇంజెక్షన్‌ చేస్తాడని భయం. అదే తగ్గిపోతుందిలే.. ఇప్పుడు ఇంజెక్షన్‌ ఎవరు వేయించుకుంటారంటూ అలా మొండిగా ఉంటారు. ఇక పిల్లల విషయమైతే వేరేగా చెప్పక్కర్లేదు.. ఇంజెక్షన్‌ అంటే చాటు గుక్కపెట్టకుండా ఏడుస్తుంటారు. ఏళ్లు గడిచినా కొంతమందికి ఇంజెక్షన్‌ అంటే భయం అలానే ఉంటుంది. దాన్నే ట్రిపనోఫోబియా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం పిల్లలు, 30 శాతం మంది పెద్దలు కూడా ఈ ట్రిపనోఫోబియా బాధితులే.

అయితే.. ఇలా ఇంజెక్షన్‌ అంటే భయపడేవారికి ఓ గుడ్‌న్యూస్‌. ఇకపై సూది లేని ఓ కొత్త ఇంజెక్షన్‌ అందుబాటులోకి రానుంది. నొప్పి ఉండదు, ఇంజెక్షన్‌ అనే భయం అసలే ఉండదు. సూది లేని ఇంజెక్షన్లను తీసుకొస్తున్నామని ‘ఇంటెగ్రి మెడికల్‌’ సంస్థ తాజాగా ప్రకటించింది. బెంగళూరులో మంగళవారం నిర్వహించిన ఓ సమావేశంలో సంస్థ ప్రతినిధులు స్కాట్ మెక్‌ఫార్లాండ్, అంకుర్‌ నాయక్, సర్వేష్‌ ముతా, మార్క్‌టిమ్‌లు ఈ సూది లేని ఇంజెక్షన్‌ వివరాలు వెల్లడించారు. ‘‘ఎన్‌-ఫిస్‌’ పేరిట సూది రహిత ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తుంది.

దాంతో ఎలాంటి నొప్పి లేకుండానే కండరాల్లోకి ఔషధం వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్‌ను దేశంలో వెయ్యి కన్నా ఎక్కువ మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. టీకాలు తయారు చేసే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియాతో తమ ఉత్పత్తిని వినియోగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఇంటెగ్రి మెడికల్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మరి ఇంజెక్షన్‌ అంటే భయపడేవారికి ఈ విషయం తెలియజేయండి హ్యాపీగా ఫీల్‌ అవుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే