వంటింట్లోకి వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. అక్కడ సీన్ చూసి..
వన్యమృగాలు ఆహారం, నీళ్లకోసం జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇది సాధారణమైపోయింది. కోతులు, పులులు, ఎలుగుబంట్లు, సింహాలు ఒకటేమిటి అన్ని జంతువులు పుణ్యక్షేత్రాలు, గ్రామ శివారు ప్రాంతాలలోకి చొరబడుతూ మనుషులపై దాడులకు పాట్పడుతున్నాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు మనం నెట్టింట చూస్తున్నాం.
తాజాగా గుజరాత్‌లో ఇంట్లోకి చొరబడింది ఓ సింహం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది ఇంట్లో ప్రత్యక్షమైతే పరిస్థితిని ఓ సారి ఊహించుకోండి. అదికూడా రాత్రివేళ కనిపిస్తే.. గుండెజారినంత పనవుతుంది. గుజరాత్‌లో అదే జరిగింది. అమ్రేలీ జిల్లాలోని ఓ ఇంట్లోకి సింహం ప్రవేశించి ఆ ఇంటివారిని పరుగులు పెట్టించింది. అర్ధరాత్రి వంటింట్లో ఏదో చప్పుడు కావడంతో ఆ ఇంటి యజమాని ఏమై ఉంటుందా అని కిచెన్‌లోకి వెళ్లి చూడగా అక్కడ సింహం కూర్చుని కనిపించింది. దెబ్బకు భయంతో బయటకు పరిగెత్తాడు ఆ ఇంటి యజమాని. వంటింటి కిటికీ నుంచి ఇంట్లోకి ప్రవేశించేందుకు సింహం ప్రయత్నించింది. ఈ క్రమంలో అది కిటికీలో ఇరుక్కుపోయిందో లేక అక్కడ దానికి ఎలాంటి జంతువు కనిపించక వెళ్లనా వద్దా అని ఆగిందో కానీ చాలా సమయం అది కిటికీలోనే కూర్చుండిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..
చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

