ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
మరణించిన ఆత్మీయులతో మాట్లాడాలని కోరుకునేవారి కోసం జపాన్‌లో వెలిసిన 'విండ్ టెలిఫోన్' ఒక అద్భుతమైన ఆవిష్కరణ. వైర్లు లేని ఈ ఫోన్ బూత్ ద్వారా ప్రజలు తమ గుండెలోని మాటలను గాలితో సంభాషిస్తూ దుఃఖాన్ని దూరం చేసుకుంటారు. సునామీ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రేమను, జ్ఞాపకాలను పదిలపరుచుకునే ఈ ప్రత్యేక అనుభవం వేలాది మందికి ఓదార్పునిస్తోంది.
మరణం అనేది మనిషిని భౌతికంగా దూరం చేయవచ్చు, కానీ ఆ వ్యక్తిపై ఉన్న ప్రేమను, జ్ఞాపకాలను దూరం చేయలేదు. చనిపోయిన తమ ప్రియమైన వారితో ఒక్కసారైనా మాట్లాడాలి, మనసులోని మాటను వారికి చేరవేయాలి అని తపించే వారి కోసం జపాన్‌లో ఒక వింత టెలిఫోన్ బూత్ వెలిసింది. దీనిని ‘విండ్ టెలిఫోన్’ అని పిలుస్తారు.జపాన్‌కు చెందిన గార్డెన్ డిజైనర్ ఇటారు ససాకి, 2010లో తన కజిన్ క్యాన్సర్‌తో మరణించినప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన సోదరుడితో మాట్లాడలేకపోయాననే బాధ ఆయనను వెంటాడింది. ఆ సమయంలోనే ఆయనకు ఒక వినూత్న ఆలోచన వచ్చింది. ఓట్సుచి పట్టణంలోని ఒక కొండపై పాతకాలపు టెలిఫోన్ బూత్‌ను ఏర్పాటు చేశారు. ఈ బూత్‌లో ఉన్న పాత రోటరీ ఫోన్‌కు ఎటువంటి వైర్లు ఉండవు, అది ఏ టెలికమ్ వ్యవస్థకు కనెక్ట్ అయి ఉండదు.అక్కడికి వచ్చే వారు ఫోన్ రిసీవర్ పట్టుకుని అవతలి వైపు తమ ఆత్మీయులు ఉన్నట్లుగా ఊహించుకుని గంటల తరబడి మాట్లాడుతుంటారు. 2011లో జపాన్‌లో వచ్చిన భారీ సునామీ తర్వాత ఈ ‘విండ్ ఫోన్’ ఒక్కసారిగా ప్రసిద్ధి చెందింది. తమ ఆత్మీయులను కోల్పోయిన వేలాది మంది బాధితులు ఈ కొండపైకి వచ్చి, గాలితో సంభాషిస్తూ తమ గుండె బరువును దించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బూత్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది, అనేక దేశాల్లో ఇలాంటి ‘విండ్ ఫోన్స్’ వెలుస్తున్నాయి. విండ్ ఫోన్ ను ఇప్పటివరకు కనీసం 25 వేల మందికి పైగా వాడుకున్నారు. అక్కడికి వచ్చిన వారంతా మరణించిన తమ ఆప్తులు అవతలి వైపు తమ మాటలను వింటారని నమ్మి వచ్చిన వారే. ఈ బూత్ లో ఒక నోట్ బుక్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రజలు తమ మనసులో మాటలను రాస్తుంటారు. ఈ ప్రత్యేకమైన ఫోన్ బూత్ విశేషంగా జనాదరణ పొందింది. ఈ టెలిఫోన్ బూత్ పై ‘ది విండ్ ఫోన్’ అనే సినిమా కూడా తెరకెక్కింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే తొలి క్లోన్ వరి వంగడం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం రైల్వేస్టేషన్లు,బస్‌స్టేషన్లు రద్దీ
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్‌లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా

