ప్రపంచంలోనే తొలి క్లోన్ వరి వంగడం
చైనీస్ పరిశోధకులు సరికొత్త స్వయం-క్లోనింగ్ హైబ్రిడ్ వరిని అభివృద్ధి చేశారు. ఇది అపోమిక్సిస్ ద్వారా ఫలదీకరణ లేకుండా విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది, అధిక దిగుబడి లక్షణాలను నిలుపుకుంటుంది. ప్రపంచ వరి ఉత్పత్తిని రెట్టింపు చేయగల సామర్థ్యంతో పాటు, ఈ వంగడం రైతులకు విత్తన ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. ఇది ప్రపంచ ఆహార భద్రతకు ఒక గొప్ప ముందడుగు.
చైనీస్ పరిశోధకులు సరికొత్త హైబ్రిడ్ వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇది క్లోనింగ్ ద్వారా తన నకలును తనే తయారు చేసుకుంటుంది. ఇది ఫలదీకరణ లేకుండా విత్తనాలను అభివృద్ధి చేసే ప్రక్రియ. ఒక తరం తర్వాత మరో తరానికి తన అత్యధిక దిగుబడి లక్షణాలను కాపాడుకుంటుంది. కొన్ని అంచనాల ప్రకారం, ఈ కొత్త హైబ్రిడ్ రకాన్ని ప్రపంచంలోని వరి సాగు రైతులందరూ నాటితే, ప్రపంచ వరి ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. జన్యుపరంగా రెండు వేర్వేరు పేరెంట్స్ నుంచి సంకరజాతి వరి వంగడాన్ని సృష్టించడంలో చైనా ప్రసిద్ధి చెందింది. ఈ వరి వంగడాలు అత్యధిక దిగుబడిని ఇస్తాయి. ప్రపంచంలో మొదటి అత్యధిక దిగుబడిని ఇచ్చే వాణిజ్యపరమైన వరి రకాలను అభివృద్ధి చేసింది చైనాయే. అంతేకాకుండా, హైబ్రిడ్ వరి విషయంలో ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారు, వినియోగదారుగా కూడా నిలిచింది. రైతులు ప్రతి సంవత్సరం కొత్త విత్తనాలను కొనాల్సి ఉంటుంది . హైబ్రిడ్ వరి వంగడాల కోసం రైతులకు చాలా ఖర్చు చేయాలి. సాధారణ వరి విత్తనాల ధర కన్నా సుమారు 100 రెట్లు ఉంటుంది. చైనా జాతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన బృందం ఈ వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన వాంగ్ కేజియాన్ మాట్లాడుతూ, హైబ్రిడ్ వరికి అపొమిక్సిస్ లక్షణాన్ని పరిచయం చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ విత్తనాలను వాణిజ్యపరంగా అమ్మితే, ధరలు బాగా తగ్గుతాయని అన్నారు. ఈ వరి వంగడం తన నకలును తానే సృష్టించుకోగలిగే సూపర్ రైస్‌ను సృష్టించగలిగింది. పురుగులు, వ్యాధులను నిరోధించగలిగే సామర్థ్యం ఉన్న హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధిపై చైనాలో ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

