మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
ప్రపంచవ్యాప్తంగా ఏఐ, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల కోతలు భారీగా పెరుగుతున్నాయి. ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సాస్ఎస్‌టీఆర్ వ్యవస్థాపకుడు జేసన్ లెమ్కిన్ తన సేల్స్ టీమ్‌ను ఏఐ ఏజెంట్లతో భర్తీ చేశారు, భవిష్యత్తులోనూ మానవ నియామకాలు ఉండవని చెబుతున్నారు. ఇది ఉద్యోగాల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ఉత్పాదకత పెరిగినా, ఏఐకి పరిమితులున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తుమ్మితే ఉద్యోగాలు పోయే కాలం ఇదీ.. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు ఊడుతున్నాయి.. 20 ఏళ్లు సంస్థను పట్టుకొని అష్టకష్టాలు పడి పనిచేసిన సీనియర్లను అని కూడా చూడకుండా సాగనంపుతున్న దారుణ పరిస్థితులు కంపెనీల్లో ఉన్నాయి. ఐటీ రంగం ఏఐ రాకతో చిగురుటాకులా వణుకుతోంది. ఏఐ, ఆటోమేషన్ తో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. సాఫ్ట్‌వేర్ వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, వ్యవస్థాపకుల నెట్‌వర్కింగ్ సంస్థ సాస్ఎస్‌టీఆర్ వ్యవస్థాపకుడు జేసన్ లెమ్కిన్ తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ నుంచి ఇద్దరు హై ప్రొఫైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నట్లుండి వెళ్లడంతో.. ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. ఒక్కో జూనియర్ సేల్స్ రెప్రెజెంటేటివ్‌ని 1.5 లక్షల డాలర్ల వార్షిక జీతం అంటే దాదాపు రూ.1.35 కోట్లతో నియమించుకోవడం బదులు, ఏఐ ఏజెంట్లను రంగంలోకి దింపారు. తన మార్కెట్ టీంలో చివరి వ్యక్తి రాజీనామా అనంతరం, మొత్తం బృందాన్ని ఏఐ ఏజెంట్లతో నింపేశారు. భవిష్యత్తులోనూ సేల్స్ విభాగంలో మనుషులను నియమించేది లేదని ఆయన చెబుతున్నారు. వర్చువల్ అసిస్టెంట్లయిన ఏఐ ఏజెంట్ల ద్వారానే సమస్యల పరిష్కారం, ప్రణాళికల రూపకల్పన, చర్యలు తీసుకోవడం వంటి పనులన్నీ ఆటోమేషన్ ద్వారా చేసేలా కొత్త ఆపరేటింగ్ మోడల్‌ను సిద్ధం చేశారు. ఈ మోడల్‌లో ఒకరు లేదా ఇద్దరు మనుషులు, 20 ఏఐ ఏజెంట్లను నిర్వహిస్తున్నారు. ఏఐ ఏజెంట్ల వల్ల ఉత్పాదకత పెరిగినా, వాటికి పరిమితులైతే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆధార్’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..
సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

