AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neem Leaves: మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే.. ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రై చేయండిలా..

ఎన్నో ఔషద గుణాలు కలిగిన వేప ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. అయితే, వేపతో అందాన్ని మరింత పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. వేప కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు.. అందాన్ని పెంచేందుకు కూడా ఉపయోగిపడతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేపతో తయారు చేసిన ఫేస్ మాస్క్ వారానికొకసారైనా వేసుకుంటే స్కిన్ టోన్ పెరుగుతుంది. మీ స్కిన్‌ టోన్‌ అందంగా, యవ్వనంగా కనిపించాలంటే వేపాకులతో ఫేస్​ప్యాక్​ను ట్రై చేసి చూడండి..ఈ ప్యాక్​ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Apr 16, 2025 | 3:42 PM

Share
వేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ వ్యాధులను తగ్గించటమే కాకుండా, చర్మ సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. వేప ఫేస్‌ప్యాక్‌ వల్ల చర్మం అందంగా తయారవుతుంది. ముఖంపై మొటిమలు, ముడతలు, నల్లటి మచ్చలు తగ్గుతాయి. వేప ఫేస్‌ప్యాక్‌ను తరుచుగా ఉపయోగిస్తే మొఖం మీద ఉన్న మచ్చలన్ని తొలగిపోతాయి.

1 / 6
జిడ్డు చర్మాన్ని దూరం చేయడానికి వేపాకు బాగా పనిచేస్తుంది. వేపలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. గాయాలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంతో వేప సమర్థవంతంగా పని చేస్తుంది. వేప ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించి ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది. వేప ఫేస్‌ప్యాక్‌ ముఖంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ముడతలను తొలగిస్తుంది.

2 / 6
ఫేస్‌ ప్యాక్‌ కోసం వేపాకుల పేస్ట్‌లో కొంచం పసుపు వేసి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేసుకుంటే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగుతాయి.

3 / 6
వేపాకులు, తులసి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొంచెం రోజ్ వాటర్‌తో మిక్స్ చేసుకుని చక్కటి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకుని దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ చేస్తే ముఖం పై మొటిమలు పూర్తిగా తగ్గుతాయి.

4 / 6
వేపాకుల పేస్ట్‌లో కొంచెం పెరుగు, నిమ్మరసం వేసి కూడా ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావు గంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై జిడ్డు తొలగిపోతుంది.

5 / 6
వేపాకు పేస్ట్‌లో కొంచెం తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పావుగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇది చర్మానికి అవసరమైన తేమను అందించే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
కొన్ని వేపాకులను తురిమిన దోసకాయ తీసుకుని రెండింటిని కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకొని స్క్రబ్‌ చేస్తే మృతకణాలు తొలగుతాయి.

వేపాకు పేస్ట్‌లో కొంచెం తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పావుగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇది చర్మానికి అవసరమైన తేమను అందించే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. కొన్ని వేపాకులను తురిమిన దోసకాయ తీసుకుని రెండింటిని కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకొని స్క్రబ్‌ చేస్తే మృతకణాలు తొలగుతాయి.

6 / 6