రేపో మాపో కుక్క చావు చస్తావు.. ఆ వ్యక్తి పై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా తమ గ్లామర్ ఫోటోలు, వీడియోలతో పాటు సమాజంలో జరిగే సంఘటనల పై కూడా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసి ఓ వ్యక్తి పై మండిపడింది. యాక్సిడెంట్ అయ్యి చస్తావ్ అంటూ ఫైర్ అయ్యింది.

సినీ సెలబ్రెటీలు కేవలం మూవీస్ తోనే కాదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాగే తమ పై నెగిటివ్ కామెంట్స్ చేసేవారి పై విరుచుకుపడుతుంటారు. ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ సమాజంలో జరిగి సంఘటనల పై కూడా స్పందిస్తూ ఉంటారు. సమాజంలో జరిగే దారుణాలు పై స్పందిస్తూ ఉంటారు. దేశంలో జరిగే చేదు సంఘటనలు, మహిళల పై జరిగే అరాచకాల పై కూడా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఓ వ్యక్తి పై మండిపడింది. ఈ రోజు కాకపోయినా రేపో మాపో ఖచ్చితంగా కుక్క చావు చస్తావ్.. లేదా మీ పిల్లలు వాళ్ల పిల్లలు ఈ పాపానికి తగ్గ కర్మ ఫలం అనుభవిస్తారు అంటూ సీరియస్ అయ్యింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆ వ్యక్తి ఏం పని చేశాడు.?
ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్
టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో మాధవి లతా ఒకరు. హీరోయిన్ గా అవ్వక ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా నాని నటించిన స్నేహితుడు సినిమాలో చేసింది. అలాగే నచ్చావులే సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే అరవింద్ 2 ఆతర్వాత ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్
ఇక మాధవీ లత పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. బీజేపీలో యాక్టివ్ మెంబర్ గా ఉంటుంది ఈ భామ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవీ లత సమాజంలో జరిగే సంఘటనల పై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి శివాలయంలో చేయకూడని పని చేశాడు. నంది విగహం పైకి ఎక్కి కాళ్లు కడుక్కోవడం, ఆతర్వాత విగ్రహం పై మూత్రం పోయడం చేశాడు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పై మాధవీ లత మండిపడ్డారు. “అంటే అన్నామంటారు.. అదే అనకపోతే ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూడండి ఏం చేస్తున్నారో’ ..ఏం పర్లేదు ఏదో ఒకరోజు రోడ్డు మీద పోతుంటే ఎద్దు వచ్చి కడుపులో పొడుస్తుంది.. లేదా యాక్సిడెంట్ అయ్యి చస్తావ్.. అంతే కర్మ అనుభవించాలి.. నువ్వు లేదా నీ పిల్లలు వాళ్ల పిల్లలు ఈ పాపానికి తగ్గ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఈ వీడియో తీసేవాడు కాదు ఆ పక్కన ఆపకుండా నవ్వుతున్నాడు వాడు అనుభవించాల్సిందే. ఏం పర్లేదు ఇప్పుడు నవ్వి నోడు, కడుక్కున్నోడు కచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తారు. అంటూ ఫైర్ అయ్యింది మాధవీలత. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మాధవీలత పై ప్రశంసలు కురిపిస్తూనే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పై తిట్లు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.