AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అంతే కాదు ఆమె ఒక లాయర్, నిర్మాత, సామాజిక కార్యకర్త కూడా.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. విలన్ పాత్రలు, సహాయక పాత్రలు, కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాల్లో ఎంతో సక్సెస్ అయినఆమె జీవితంలోనూ అంతే ట్విస్ట్ లు కూడా ఉన్నాయి.

వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2025 | 10:19 AM

Share

ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అంతే కాదు ఆమె ఒక లాయర్, నిర్మాత, సామాజిక కార్యకర్త కూడా.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. విలన్ పాత్రలు, సహాయక పాత్రలు, కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాల్లో ఎంతో సక్సెస్ అయినఆమె జీవితంలోనూ అంతే ట్విస్ట్ లు కూడా ఉన్నాయి. రెండు వివాహాలు చేసుకుంది. అలాగే ఓ ఓ హీరోతో.. ఓ స్టార్ సింగర్ తో ఎఫైర్ నడిపిందని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ హీరో గురించి ఆమె మాట్లాడుతూ.. అతను నా కన్నా వయసులో చాలా చిన్నవాడు అయినా కూడా అతను ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

కునిక సదానంద్ లాల్ ఒక భారతీయ నటి, న్యాయవాది, నిర్మాత, సామాజిక కార్యకర్త. ఆమె బాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలు, హాస్య పాత్రలతో సహా విభిన్న పాత్రల్లో నటించి ప్రసిద్ధి చెందింది. ఆమె నటనా రంగంలో 1980ల నుండి 1990ల వరకు యాక్టివ్ గా ఉంది. అనేక హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. కొన్ని ప్రముఖ చిత్రాలలో “బేటా” (1992), “గం రాజా హమ్ దీవానే” (1992) వంటివి ఉన్నాయి, ఇందులో ఆమె విలన్‌గా గుర్తింపు పొందింది. నటనతో పాటు, కునిక సంగీత రంగంలో కూడా కృషి చేసింది. ఆమె “లాఖో మే ఏక్” (1996), “కునిక” (2002), “జూంబిష్ – ఎ మిస్టికల్ జర్నీ” (2006) అనే మూడు పాప్ ఆల్బమ్‌లను విడుదల చేసింది. వ్యాపార రంగంలో కూడా ఆమె పాల్గొంది, “వైట్ – ది ఇటాలియన్ కేఫ్”, “జింగ్ కేఫ్”, మరియు “మజెస్టికా – ది రాయల్ బ్యాంక్వెట్ హాల్” వంటి రెస్టారెంట్లను తన వ్యాపార భాగస్వామితో కలిసి స్థాపించింది.

కునిక వ్యక్తిగత జీవితంలో రెండు వివాహాలు చేసుకుంది. మొదటి వివాహం ఢిల్లీకి చెందిన అభయ్‌తో జరిగింది. రెండవ వివాహం 35 సంవత్సరాల వయసులో మిస్టర్ లాల్‌తో జరిగింది. 1980లలో ఆమె నటుడు ప్రాణ్ కుమారుడు సునీల్ సికంద్‌తో, 1990ల చివరలో గాయకుడు కుమార్ సానుతో ఎఫైర్స్ పెట్టుకుందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్ గురించి తెలిపింది. అక్షయ్‌ కుమార్‌కి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్‌ గురించి కూడా మాట్లాడింది. మగవాళ్లలో మేల్‌ హార్మోన్‌ గురించి కూడా మాట్లాడింది. మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ పెరుగుతుంది దాంతో ఆడవాళ్ళ కు ఆకర్షణ కలగడం సహజం. అక్షయ్ కుమార్ కు మగతనం ఎక్కువ అని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్