ఒకప్పుడు హీరోయిన్‌గా చేసింది.. ఇప్పుడు వేశ్య పాత్రలో మెరవనుంది.. ఎవరో తెలుసా.?
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే ఆ జోరును మాత్రం కంటిన్యూ చేయలేకపోతున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతున్నారు. మరికొంతమంది అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. అం ఎవరో గుర్తుపట్టారా .?

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు. కొంతమంది కొన్ని సినిమాలే చేసి ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం ఊహించని విధంగా అవకాశాలు తగ్గి సినిమాలకు దూరం అవుతున్నారు వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకానొక సమయంలో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత సహాయక ఓపాత్రలు చేసింది. ఆతర్వాత కనిపించకుండా మాయం అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. ఇంతకూ పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? సినిమాలకు దూరం అయినా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందని ఈ చిన్నది. రెగ్యులర్ గా గ్లామర్ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..
తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఆకట్టుకున్నారు. కొంతమంది కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. బిందు మాధవి.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు “అవకాయ్ బిర్యానీ” తో తన సినీ కెరీర్ మొదలుపెట్టింది. ఈ సినిమా సెకండాండ్రి రాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, తర్వాత ఆమె తమిళ సినిమా పరిశ్రమ వైపు దృష్టి సారించింది.
తమిళంలో “పొక్కిషం”, “కజుగు”, “కెడి బిల్లా కిల్లాడి రంగా” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగులో “రామ రామ కృష్ణ కృష్ణ”, “పిల్ల జమీందార్” వంటి సినిమాల్లో కూడా ఆమె నటన ప్రశంసలు అందుకుంది. బిందు మాదవి 2022లో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన “బిగ్ బాస్ నాన్-స్టాప్” షో మొదటి సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది, దీనితో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే సినిమాల్లో బిందు మాధవి పెద్దగా యాక్టివ్ గా లేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ చిన్నది ఓ ఛాలెంజింగ్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. దండోరా’ అనే సినిమాలో బిందు మాధవి నటిస్తుంది. ఈ సినిమాలో ఈ చిన్నది వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.