నాకు ఏమీ తొందర లేదు..! ఆ హీరోయిన్‌తో పోల్చిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన నిధి అగర్వాల్..
నిధి అగర్వాల్. బెంగుళూరుకు చెందిన ఈ అమ్మడు హైదరాబాద్ లోనే పెరిగింది. చదువు మధ్యలోనే నటనపై ఆసక్తితో మోడిలంగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

నిధి అగర్వాల్.. సాలిడ్ హిట్ పడలేదు కానీ ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో ఇప్పుడు మారుమ్రోగేది. ఈ హాట్ బ్యూటీ భారీ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తుంది. బాలీవుడ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినీ ముద్దుగుమ్మ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆతర్వాత అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
దాంతో ఈ అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది . మిస్టర్ మజ్ను సినిమా తర్వాత రామ్ పోతినేని, పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతోపాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నిధి గ్లామర్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వరుస సినిమాలతో నిధి అగర్వాల్ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తెలుగులో అవకాశాలు తలుపు తట్టకపోవడంతో తమిళ్ వైపు వెళ్ళింది. కానీ అక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు.
ఇక ఇప్పుడు తెలుగులో రెండు బడా సినిమాలు చేస్తుంది. ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తుంది. తాజాగా నిధి అగర్వాల్ పై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి స్ట్రాంగ్ రిప్లే ఇచ్చింది. ఓ నెటిజన్ శ్రీలీలతో నిధిని పోల్చుతూ ఓ కామెంట్ చేశాడు. 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత నిధి అగర్వాల్ ఎన్ని సినిమాలు చేసింది.? అసలు ఆమె ఏం చేస్తుంది.? 2021లో వచ్చిన శ్రీలీలను చూడండి 20 సినిమాలకు పైగానే చేసింది’ అని కామెంట్ చేశాడు. దానికి అదిరిపోయే రిప్లే ఇచ్చింది నిధి. “ఇస్మార్ట్ శంకర్ తర్వాత ‘హీరో’ మూవీ చేసింది. తమిళంలో 3 సినిమాలు చేసింది. అలాగే ‘హరి హర వీరమల్లు’ సినిమాకు సైన్ చేసింది. నేను మంచి స్క్రిప్ట్‌లు అనుకున్న సినిమాలకే నేను సైన్ చేస్తున్నా. దాని కోసం నేను కొంత టైమ్ తీసుకుంటున్నా. కొన్నిసార్లు నా నిర్ణయం తప్పు అయి ఉండొచ్చు. కానీ మంచి సినిమాల్లో భాగం కావాలనేది నా ఇంటెన్షన్. నాకు ఏమీ తొందర లేదు.. నేను ఇక్కడే ఇండస్ట్రీలోనే ఉన్నాను బ్రదర్. నువ్వు బాధపడకు” అంటూ రాసుకొచ్చింది నిధి అగర్వాల్.
2019 ismart tarwatha em chesindi ? enni chesindi ?
2021 lo vachina sreeleela 20 + cinemalu chesindi 🤷🏼♂️
— 💀NATION (@iPACTweets) April 13, 2025
శ్రీలీల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.