- Telugu News Photo Gallery Cinema photos AP Deputy CM Pawan Kalyan Wife Anna donates Rs.17 Lakh to TTD Annaprasada in the name of son Mark Shankar
కుమారుడు మార్క్ శంకర్ పేరిట నిత్యాన్నదానానికి రూ. 17 లక్షల విరాళం అందజేసిన పవన్ సతీమణి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకి వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Updated on: Apr 14, 2025 | 12:55 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకి వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

స్వామి వారి దర్శనానంతరం ఉదయం 10 గంటల సమయంలో అన్నా కొణిదల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు.

అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.





























