Movie Releases: ఆఫర్ట్ సమ్మర్ పాన్ ఇండియా మూవీస్.. జూన్, జూలైలో సందడికి రెడీ..
సాధారణంగా సమ్మర్‌లో తమ సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు స్టార్ హీరోలు. కానీ ఈ సమ్మర్‌లో మాత్రం ఆ సందడి కనిపించటం లేదు. సమ్మర్ టార్గెట్‌గా బిగ్ స్టార్ బరిలో దిగుతున్న దాఖలాలు కనిపించటం లేదు. కానీ ఆఫర్ట్ సమ్మర్ కాస్త హడావిడి కనిపిస్తోంది. కొన్ని పాన్ ఇండియా సినిమాలు జూన్, జూలై నెలలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 14, 2025 | 12:01 PM

జూన్ నెలలో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ చిత్రాలు రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. మే నెలాఖరున కింగ్‌డమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ. మే 30న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కమల్ హాసన్ థగ్‌లైఫ్ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం ఇది. ఈ చిత్రంలో సిలంబరసన్, త్రిష కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాసర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్, వైయాపురి వంటి వారు నటిస్తున్నారు.

ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన కుబేరా, మంచు విష్ణు నటించిన మైథలాజికల్ మూవీ కన్నప్ప జూన్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

ఇప్పటి వరకు జూలై నెలలో అఫీషియల్‌గా ఒక్క సినిమా కూడా డేట్ లాక్ చేయలేదు. కానీ మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాను ఇంద్ర రిలీజ్ అయిన జూలై 24న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

అదే జరిగితే.. జూలై క్యాలెండర్‌లో కూడా బిగ్ ప్రాజెక్ట్ పడినట్టే. ఇలా ఆఫ్టర్ సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలతో జూన్, జూలై క్యాలెండర్ కూడా బిజీగానే కనిపిస్తోంది. చుడాలిక ఇండస్ట్రీలో మరి ఏమి జరగనుందో.? మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో.?





























