- Telugu News Photo Gallery Cinema photos An interesting discussion started in Bollywood with the blockbuster of Jaat
Bollywood Mass: బాలీవుడ్‌లో జాట్ బ్లాక్ బస్టర్.. ఇంట్రస్టింగ్ డిస్కషన్ స్టార్ట్..
మరోసారి నార్త్ మార్కెట్‌లో మన టాలెంట్ బ్లాక్ బస్టర్ కొట్టింది. జాట్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ మలినేని తొలి సినిమాతోనే బిగ్ హిట్ అందుకున్నారు. జాట్ భారీ వసూళ్లు సాధించటంలో పాటు విమర్శకులను కూడా మెప్పించటంతో నార్త్ ఆడియన్స్ టేస్ట్ గురించి ఇంట్రస్టింగ్ డిస్కషన్ మొదలైంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 14, 2025 | 12:30 PM

సన్నిడియోల్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జాట్. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సౌత్ టాలెంట్ మరోసారి నార్త్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. అదే సమయంలో బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న మన దర్శకుల మధ్య ఇంట్రస్టింగ్ సిమిలారిటీస్ గురించి కూడా డిస్కషన్ మొదలైంది.

రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్‌లో సక్సెస్ అయిన సౌత్ సినిమాలన్నీ ఊరమాస్ యాక్షన్ డ్రామాలే. కంప్లీట్ సౌత్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన పుష్ప అయినా... తెలుగు డైరెక్టర్ బాలీవుడ్‌లో తెరకెక్కించిన యానిమల్ అయినా... మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లే. సౌత్ నుంచి వెళ్లిన ఇలాంటి సినిమాలకే బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మారథం పట్టారు.

జెర్సీ లాంటి ఎమోషనల్ డ్రామాను బాలీవుడ్‌లో రీమేక్ చేసిన గౌతమ్ తిన్ననూరి, హిట్ లాంటి థ్రిల్లర్‌ను నార్త్ ఆడియన్స్‌కు పరిచయం చేసిన శైలేష్ కొలను సక్సెస్ కాలేకపోయారు. ఈ ఎగ్జామ్‌పుల్స్ చూశాక, కంటెంట్ వెయిటేజ్ కన్నా... కమర్షియల్ ఎలిమెంట్స్‌కే బాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారంటున్నారు సౌత్ మేకర్స్.

గతంలో బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించిన టాప్ డైరెక్టర్స్ కూడా రీసెంట్ టైమ్స్‌లో ఫెయిల్ అవుతున్నారు. బాలీవుడ్‌లో గజిని, హాలిడే లాంటి హిట్స్ ఇచ్చిన మురుగదాస్, రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ హీరోగా సికందర్ సినిమా చేశారు.

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మినిమమ్ బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. దీంతో మన దగ్గర నుంచి వెళుతున్న మాస్ కంటెంట్‌ని మాత్రమే నార్త్ ఆడియన్స్ ఆదరిస్తున్నారన్న ఒపీనియన్‌కు వచ్చేశారు ఇండస్ట్రీ జనాలు.





























