- Telugu News Photo Gallery Cinema photos Once again, RRR has been nominated in that category on the Oscar shortlist
RRR Oscar: మరోసారి ఆస్కార్ లిస్ట్‌లో ట్రిపులార్.. ఈ సారి ఆ కేటగిరిలో ఎంపిక..
మరోసారి ఆస్కార్ లిస్ట్‌లో మెరిసింది మన సినిమా ట్రిపులార్. ఇండియా సినిమాకు తొలి ఆస్కార్ అందించిన ఘనత ట్రిపులార్ దే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ట్రిపులార్‌కు అవార్డ్ దక్కింది. అకాడమి అవార్డ్స్ వందేళ్ల వేడుక సందర్భంగా మరోసారి ట్రిపులార్‌ను గుర్తు చేసుకుంది జ్యూరి. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 14, 2025 | 1:06 PM

ఇండియన్ ఆడియన్స్ ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిన సినిమా ట్రిపులార్. ఆస్కార్ బరిలో మన సినిమా కూడా అవార్డు అందుకుంటే చూడాలని ఎదురుచూసిన ఫ్యాన్స్ ఆకలి తీర్చింది ట్రిపులార్.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి ట్రిపులార్ సినిమాలోని నాటు నాటు పాట అవార్డ్ దక్కించుకుంది. ట్రిపులార్‌కు ఆస్కార్ వచ్చిన తరువాత అకాడమి జ్యూరీలో ఇండియన్ సినిమాల ప్రస్థావన తరుచూ కనిపిస్తోంది.

అకాడమీస్ బ్రాంచ్ ఆఫ్ యాక్టర్స్ లిస్ట్‌లో ట్రిపులార్ హీరోలిద్దరికీ స్థానం దక్కింది. ఇప్పుడు మరోసారి ట్రిపులార్‌ను గుర్తు చేసుకుంది ఆస్కార్ జ్యూరీ. అకాడమి జ్యూరి స్టార్ట్ అయి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అవార్డ్స్ లిస్ట్‌లో కొన్ని కొత్త కేటగిరీలను చేర్చింది.

ఈ లిస్ట్‌లో యాక్షన్ డిజైన్ కేటగిరినీ ట్రిపులార్‌లోని యాక్షన్ స్టిల్‌తో ఎనౌన్స్ చేయటంతో ఇండియన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరోసారి అంతర్జాతీయ వేదిక మీద ట్రిపులార్ ప్రస్థావన రావటంతో తెలుగు ఆడియన్స్ ఆస్కార్ వైబ్‌లోకి వెళ్లిపోయారు.

దీని గురించి రాజమౌళి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వందేళ్ల కళ ఇప్పుడు నెరవేరింది అంటూ.. యాక్షన్ డిజైన్ కేటగిరిలో ట్రిపులార్ ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేసారు ఈ పాన్ ఇండియా దర్శకుడు.





























