- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia will be seen in two variations in the 2 weeks
Tamannaah Bhatia: పవర్‌ఫుల్ టూ గ్లామర్.. 2 వారాల్లో రెండు వేరియేషన్స్‌లో తమన్నా..
సాధారణంగా గ్లామర్ ఇమేజ్‌కు దూరమైన హీరోయిన్సే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారు. కానీ ఈ విషయంలో తమన్నా మాత్రం డిఫరెంట్. ఓ వైపు గ్లామర్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతున్నారు. రెండు వారాల గ్యాప్‌లోనే రెండు వేరియేషన్స్ చూపించబోతున్నారు ఈ బ్యూటీ.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Apr 14, 2025 | 1:40 PM

సాధారణంగా గ్లామర్ ఇమేజ్‌కు దూరమైన హీరోయిన్సే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారు. కానీ ఈ విషయంలో తమన్నా మాత్రం డిఫరెంట్. ఓ వైపు గ్లామర్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటుతున్నారు. రెండు వారాల గ్యాప్‌లోనే రెండు వేరియేషన్స్ చూపించబోతున్నారు ఈ బ్యూటీ.

సీనియర్ బ్యూటీస్ అంతా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటే తమన్నా మాత్రం జెట్ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఓ వైపు గ్లామర్ రోల్స్ మరో వైపు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్‌తో సత్తా చాటుతున్నారు.

తెలుగులో ఓదెలా 2 సినిమా కోసం ఫస్ట్ టైమ్ శివశక్తిగా మారారు ఈ బ్యూటీ. ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి కొనసాగింపుగా ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఓదెలా 2 ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంపత్ నంది నిర్మాతగా అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో శివశక్తిగా పవర్‌ఫుల్ రోల్‌లో నటించారు తమన్నా. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.

ఓదెలా 2 రిలీజ్ అయిన రెండు వారాల తరువాత రైడ్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మిల్కీ బ్యూటీ. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా.. అల్ట్రా గ్లామరస్ లుక్‌లో అదరగొడుతున్నారు. శుక్రవారం రిలీజ్ అయిన నషా పాట తమన్నాలోని గ్లామర్ యాంగిల్‌ను కొత్తగా చూపించింది.