Hanuman Jayanti: సిల్వర్ స్క్రీన్ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే..
ఏప్రిల్ 12న జరిగిన రామభక్త హనుమాన్ జయంతి రోజున ఆలయాలన్నీ శోభాయమానంగా కనిపిస్తున్న వేళ, సిల్వర్ స్క్రీన్ మీద రామనామస్మరణ ఎలా జరిగింది.? ఏ మూవీ అప్డేట్స్ వచ్చాయి.? ఒకసారి మనసారా గుర్తుచేసుకుంటున్నారు భక్తులు. మనం కూడా వాళ్లతో శ్రుతి కలిపేద్దామా.?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 14, 2025 | 2:17 PM

హనుమాన్ సినిమా చేసిన సందడిని ఇంకా మర్చిపోలేదు జనాలు. జై హనుమాన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఈ సారి హనుమంతుడి పాత్రలో రిషబ్ ఇంకెలా విజృంభిస్తారోనని ఎదురుచూస్తున్నారు.

రామ రామ అంటూ ఆల్రెడీ విశ్వంభరలో రాముడి పాట అలరిస్తోంది. మా ఇంటి దేవుడు హనుమంతుడు అంటూ ఇటీవల పవన్‌కల్యాణ్ తనయుడు కోలుకున్న సందర్భంగా మనసారా హనుమత్ స్మరణ చేసుకున్నారు మెగాస్టార్.

పూర్తిస్థాయి రామకథతో తెరకెక్కనుంది రామమ్. ధర్మసంస్థాపన కోసం యుద్ధం చేసిన రాముడి అడుగు జాడల్లో నడిచి నలుగురికీ ఆదర్శంగా నిలిచిన వీరుడి కథ అంటూ రామమ్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్.

ప్రస్తుతం నార్త్ లో రామాయణం రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతమ్మ తల్లిగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రలో మెప్పించడానికి ఫుల్ ప్రిపేర్ అయ్యారు యష్.

వీటితో పాటు మరికొన్ని సినిమాలు నుంచి అప్డేట్స్ వచ్చాయి. కొందరు టీజర్స్ రిలీజ్ చేస్తే.. కొందరు ట్రైలర్స్ వదిలారు. మరికొందరు సాంగ్ ప్రోమోలతో అలరించగా.. కొందరు సినిమాలు మొదలుపెట్టారు. మొత్తానికి ఇండస్ట్రీలో హనుమాన్ జయంతి వేడుకగా గట్టిగానే జరిగింది.





























