BAPS: నూతన సంవత్సరం సందర్భంగా ప్రభు నీలకంఠవర్ణి స్వామివారి అభిషేక దర్శనం..
నూతన సంవత్సరం 2026 సందర్భంగా BAPS స్వామినారాయణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపింది. మహంత్ స్వామి మహారాజ్ గారి మార్గదర్శకత్వంలో శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక వికాసంతో నిండిన సంవత్సరంగా 2026 నిలవాలని ఆకాంక్షించింది. ఈ సందర్భంగా ప్రభు నీలకంఠవర్ణి స్వామివారి అభిషేక దర్శనాన్ని భక్తులతో పంచుకుంది.

నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న శుభసమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు BAPS స్వామినారాయణ సంస్థ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక వికాసంతో నిండిన సంవత్సరంగా 2026 ప్రతి ఒక్కరి జీవితంలో నిలవాలని సంస్థ ఆకాంక్షించింది. ప్రభు స్వామినారాయణుడి పవిత్ర పాదాల సన్నిధిలో, BAPS ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారాజ్ గారి కరుణామయ మార్గదర్శకత్వంలో.. ఈ నూతన సంవత్సరం భక్తుల జీవితాల్లో దైవిక ఆశీస్సులు, అంతర్గత బలం, ఆనందాన్ని నింపాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో ప్రభు నీలకంఠవర్ణి స్వామివారి అభిషేక దర్శనాన్ని BAPS సంస్థ పంచుకుంది.
వీడియో దిగువన చూడండి….
ఈ పవిత్ర దర్శనం భక్తుల హృదయాలను పవిత్రం చేసి, ఆలోచనలకు శుద్ధిని అందించి, భక్తి, సేవ, సత్సంగ మార్గంలో ముందుకు నడిచే ప్రేరణనివ్వాలని సంస్థ పేర్కొంది. సమాజంలో శాంతి, ఐక్యత, నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా BAPS స్వామినారాయణ సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. నూతన సంవత్సరం 2026 ప్రతి కుటుంబంలో ధర్మబద్ధ జీవనానికి, మానవీయ విలువలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ శుభకరమైన, ఆశీర్వాదపూరిత నూతన సంవత్సరం 2026 కావాలని BAPS స్వామినారాయణ సంస్థ మరోసారి శుభాకాంక్షలు తెలిపింది.
