Vastu tips: మనీ ప్లాంట్ కంటే పవర్‌ఫుల్.. ఈ మొక్కతో సిరిసంపదలు మీవెంటే!
Krasula Jade: చాలా మంది తమ ఇంట్లో సానుకూల శక్తి కోసం పలు ప్రత్యేకమైన మొక్కలను నాటుతుంటారు. కొందరు సంపద పెరిగేందుకు కొన్ని మొక్కలను నాటుకుంటారు. వాటిలో ఒకటి మనీ ప్లాంట్. అయితే, దీని కంటే కూడా శక్తివంతమైన మరో మొక్క ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అదే క్రాసులా జేడ్. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు కొత్త సంపద మార్గాలు తెరచుకుంటాయని నమ్ముతారు.

వాస్తు శాస్త్రంలో మొక్కలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏయే మొక్కలు ఇంట్లో నాటుకోవచ్చు. వేటిని ఇంటిలో అస్సలు ఉంచకూడదో వాస్తు శాస్త్రం స్పష్టం చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల సానుకూల మార్పులు వస్తాయని చెబుతారు. చాలా మంది మనీ ప్లాంట్‌ను తమ నివాసాల్లో పెంచుకుంటారు. ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ మొక్క నాటడం వల్ల సంపద వస్తుందని భావిస్తారు.
అయితే, మనీ ప్లాంట్ కంటే కూడా అధిక ప్రత్యేకమైన పవిత్రమైనదిగా భావించే మొక్క కూడా ఒకటి ఉంది. ఆ మొక్కను నివాసంలో నాటుకుని పెంచుకుంటే సానుకూల వాతావరణంతోపాటు ఇంటిలోకి సిరిసంపదలు వస్తాయని నమ్ముతారు. ఆ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సిరిసంపదల ‘క్రాసులా’
ఆ మొక్క పేరే క్రాసులా జేడ్(Krasula Jade). దీన్ని ఒక ప్రత్యేక శక్తివంతమైన మనీ ప్లాంట్‌గా పరిగణిస్తారు. చైనీస్ వాస్తు శాస్త్రం లేదా ఫెంగ్ షుయ్ ప్రకారం ఇది సాధారణ మనీ ప్లాంట్ కంటే కూడా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో క్రాసుల మొక్కను నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయని నమ్ముతారు. అంతేగాక, ఈ మొక్క కొత్త ఆదాయ మార్గాలను తెరవడానికి, సానుకూల శక్తి, శ్రేయస్సును పెంచేందుకు సహాయ పడుతుంది.
క్రాసులాతో ఎలాంటి లాభాలు
మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మీ ఇంట్లో ఈ మొక్కను నాటడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం క్రాసులా మొక్కను నాటడం వల్ల మీ ఉద్యోగం, వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా.. ఇంట్లో శక్తి సమతుల్యతను కాపాడుతుంది. ఇది వ్యాపారవేత్తలకు శుభప్రదంగా పరిగణిస్తారు. క్రాసులా మొక్కను ప్రధాన ద్వారం కుడివైపున ఉంచాలి.
వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది?
క్రాసులా మొక్కను నివాసంలో నాటడం వల్ల సంపద వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ మొక్కకు అధికంగా నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. అయితే, దీని ఆకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. తగినంత సూర్య కాంతిని ఈ మొక్కకు తగిలేలా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు ఉండటం పర్యావరణాన్ని శుద్ధి చేయడంతోపాటు మానసిక సమతుల్యతను కాపాడుతుంది.
Note: ఈ సమాచారాన్ని జ్యోతిష్య శాస్త్రం, ఇతర అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.