AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజించండి.. ఏడాదంతా సిరిసంపదల వర్షం!

సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని ప్రతీ శుక్రవారం పూజించడం సాధారణ విషయమే. లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక, 2026 కొత్త సంవత్సరంలో మొదటి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ ఇంటికి ఏడాది పొడవునా సిరి సంపదలను తెచ్చిపెడుతుందని నమ్ముతారు.

తొలి శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజించండి.. ఏడాదంతా సిరిసంపదల వర్షం!
Laxmi Devi
Rajashekher G
|

Updated on: Jan 02, 2026 | 8:43 AM

Share

ప్రతీ శుక్రవారం సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని పూజించడం సాధారణ విషయమే. అయితే, 2026 సంవత్సరం తొలి శుక్రవారం నాడు ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన విషయం తెలిసిందే. అందుకే లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు.

ఇక, 2026 కొత్త సంవత్సరంలో మొదటి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ ఇంటికి ఏడాది పొడవునా సిరి సంపదలను తెచ్చిపెడుతుందని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ నూతన సంవత్సరంలో మీ ఖజానా సంపదతో నిండి ఉండాలని కోరుకుంటే.. ఈ శుక్రవారంనాడు పూజలో ఈ చిన్న పనులు చేయండి.

లక్ష్మీ దేవి ప్రసన్నం కోసం 5 గొప్ప ఉపచారాలు

లక్ష్మీదేవికి తెలుపు రంగు, తామర పువ్వు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఏడాది తొలి శుక్రవారంనాడు లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజించండి. లేదా ఇంట్లోనే లక్ష్మీదేవికి చక్కెరతో చేసిన మిఠాయి, వెన్న లేదా ఖీర్‌‌ని సమర్పించండి. వీటితోపాటు అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులను సమర్పించండి. దీంతో శుక్రుడు బలపడి మీకు సానుకూల ఫలితాలు ఇస్తాడు.

శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారా వద్ద ఆవు నెయ్యితో నింపిన దీపాన్ని వెలిగించండి. దీపానికి కొద్దిగా కుంకుమ పువ్వు లేదా యాలకులు జత చేయండి. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరం చేయడంతోపాటు లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకువస్తుంది.

ఏడాదిలో మొదటి శుక్రవారంనాడు శ్రీ యంత్రాన్ని పాలు, గంగా జలంతో అభిషేకించండి. దీన్ని మాతృరూపంగా భావిస్తారు. దీనిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల పేదరికం పోయి సిరిసంపదలు వస్తాయి.

ప్రతీ శుక్రవారం ‘కనకధార స్తోత్రం’ పఠించాలి. పఠించడం వీలుకాకపోతే ప్రశాంతమైన మనస్సుతో ఆ స్తోత్రాన్ని వినండి. హిందూ విశ్వాసాల ప్రకారం శుక్రవారాల్లో ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో శ్రేయస్సుతోపాటు సిరిసంపదలు పొందుతారు.

ఈ శుక్రవారంనాడు ఏడు లేదా పదకొండు మంది యువతులను ఆహ్వానించి, వారికి తెల్లటి స్వీట్లు తినిపించండి. హిందూ విశ్వాసాల ప్రకారం అమ్మాయిలను లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తారు. అందుకే వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇది మీ ఇంటికి సంపదను తీసుకువస్తుంది.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులో ఉన్న వనరులు, ఆధ్యాత్మిక పండితుల నుంచి తీసుకున్న విషయాలు అందించడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.