తినడానికి తిండి లేక ఇబ్బందిపడింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్..
హీరోయిన్స్ గా రాణించాలంటే అందం, అభినయం మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాలి. ఎంతో కష్టపడి హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్న వారు ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. హీరోల్లోనే కాదు.. హీరోయిన్స్ లోనూ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండ వచ్చి సక్సెస్ అయినా వారు చాలా మంది ఉన్నారు. అయితే కెరీర్ బిగినింగ్ లో చాలా మంది ముద్దుగుమ్మలు ఎన్నో కష్టాలు పడ్డాం అని పలు సందర్భాల్లో చెప్పారు.

సినీ సెలబ్రెటీల జీవితం అందరిదీ ఒకేలా ఉండదు. ఇండస్ట్రీలోకి కొంతమంది వారసులు ఎంట్రీ ఇస్తే మరికొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస అయినా వారు ఉన్నారు. కొంతమంది ఎన్నో కష్టాలు అందుభావించి స్టూడియోల చుట్టూ చెప్పులరిగేలా తిరిగి ఆతర్వాత హీరోయిన్స్ గా అవకాశాలు అందుకున్నారు. ఇక సినిమా పై పిచ్చితో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వారు కూడా లేకపోలేదు. కాగా ఓ హీరోయిన్ సినిమాల్లో అవకాశాలు రాక ముందు పడరాని పట్లు పడింది.. అవకాశాల కోసం ఆమె ఎన్నో కష్టాలను భరించింది. చివరకు హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేక ఇబ్బందిపడింది ఆమె.. కానీ ఇప్పుడు మూడు నిమిషాల పాటకు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఇండస్ట్రీలో రాణించడం అంత సులువు కాదు. ఎంతో కష్టపడితే కానీ సక్సెస్ అవ్వలేరు. అయితే కొంతమంది సినిమాల్లోకి రావడానికే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఒకరు. కెనడాలో మొరాకో సంతతికి చెందిన కుటుంబంలో జన్మించిన నోరా, బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ఆమె జీవితం కష్టాలతో మొదలైనప్పటికీ.. చివరకు సినిమా పరిశ్రమలో స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. కెనడాలో పెరిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సవాళ్లు ఎదుర్కొంది నోరా. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు ఒక్కసారిగా అవకాశాలు రాలేదు. చిన్న చిన్న పాత్రలు, ఆడిషన్స్‌లో తిరస్కరణలు, భాషా అడ్డంకులు ఇవన్నీ ఎదుర్కొంది. కానీ ఆమె డాన్స్, కష్టపడే తత్వం ఈ అమ్మడికి ఎంతో సాయం చేశాయి.
నోరా యుక్తవయసులోనే ఆమె కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది, దీంతో ఆమె చిన్న ఉద్యోగాలు చేసేది. 2014లో ఈ బ్యూటీ “రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్” సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ, ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ప్రభాస్ బాహుబలి సినిమాలో “మనోహరి” పాటతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ ముద్దుగుమ్మ డాన్స్ అందరినీ ఆకర్షించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా నటిగా మారిపోయింది నోరా ఫతేహి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
నోరా ఫతేహి ఇన్ స్టాగ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.