పొట్టిగా, లావుగా ఉన్నావ్.. ఆ జుట్టేంటి అలా ఉంది.. అంటూ హేళన చేశారు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్
హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎన్నో కస్టపడి ఉన్నత స్థాయికి వస్తారు. చాలా మంది కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆతర్వాత హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. తాజాగా ఓ హీరోయిన్ తనకు కెరీర్ బిగినింగ్ లో ఎదురైన చేదు అనుభవాలు ఎదురుకుంది. పొట్టిగా, లావుగా ఉన్నావ్ అంటూ హేళన చేశారని తెలిపింది.

సినిమా ఇండస్ట్రీని వేధిస్తున్న సమస్యల్లో బాడీ షేమింగ్ ఒకటి. చాలా మంది హీరోయిన్స్, సహాయ నటులు , లేడీ కమెడియన్స్ బాడీ షేమింగ్ బారిన పడ్డారు. గతంలో దీని గురించి కొంతమంది ఓపెన్ గా చెప్పారు. కొంచం బొద్దుగా ఉంటే లావుగా ఉన్నారు అని.. స్లిమ్ గా ఉంటే బక్క చిక్కిపోయారు అంటూ కామెంట్స్ చేస్తారని కొందరు హీరోయిన్స్ బహిరంగంగా చెప్పారు. అలాగే హీరోయిన్స్ హైట్స్ గురించి కూడా కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తాను కూడా బాడీ షేమింగ్ బారిన పడినట్టు తెలిపింది. కొందరు తనను వింత జీవిలా చూసేవారని బాడీ షేమింగ్ చేసేవారని తెలిపింది ఆ స్టార్ హీరోయిన్.. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్ గానే కాదు సింగర్ గాను తన ప్రతిభను చాటింది అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్. ఇటీవలే తన నటనకు నేషనల్ అవార్డు కూడా అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నాని నటించిన అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి ఆతర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది. ఇండస్ట్రీలో ఎన్నో వైవిద్యామైన పాత్రలో పోషించిన నిత్యామీనన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్నీ తెలిపింది. కెరీర్ బిగినింగ్ లో తన జుట్టు చూసి అందరూ తనను వింతగా చూసేవారని తెలిపింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్యా మాట్లాడుతూ.. చిన్న తనంలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అని తెలిపింది. స్కూల్ లో కాలేజ్ లో తన జుట్టు పెద్ద సమస్యగా ఉందని తెలిపింది. రింగులు తిరిగిన తన జుట్టు చూసి అందరూ తనను వింతగా చూసేవారని తెలిపింది నిత్యామీనన్. నా మొదటి సినిమా సమయంలో రింగుల జుట్టు చూసి నన్ను హేళన చేశారు అని తెలిపింది. అలాగే బాడీ షేమింగ్ కూడా చేశారు. మీరు చాలా పొట్టిగా, లావుగా, మీ కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయి అంటూ చాలా మంది హేళన చేశారు అని తెలిపింది. అయితే అదే నన్ను ప్రభావితం చేశాయి. అందుకే నేను రాణించగలుగుతున్నా.. ఇప్పుడు చాలా మందికి నా జుట్టు అంటే ఇష్టం అని తెలిపారు నిత్యామీనన్.
View this post on Instagram
నిత్యామీనన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.