AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwambhara: మెగాస్టార్‌తో డాన్స్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.? సోషల్ మీడియా నుంచి క్రేజీ క్రేజీ హీరోయిన్‌గా

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా విశ్వంభర. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలారోజుల మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Vishwambhara: మెగాస్టార్‌తో డాన్స్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.? సోషల్ మీడియా నుంచి క్రేజీ క్రేజీ హీరోయిన్‌గా
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Apr 12, 2025 | 2:38 PM

Share

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు విశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను సోహియో ఫాంటసీ మూవీ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా విశ్వంభర సినిమా సైలెంట్ గా జరుగుతుంది. ఈ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ఐదుగురు హీరోయిన్స్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర సినిమా నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు.

రామ రామ అంటూ సాగే భక్తి గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. కీరవాణి బాణీలు అందించారు. ఇక ఈసాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ సాంగ్ లో మెగాస్టార్ పక్కన ఓ యంగ్ బ్యూటీ కనిపించింది. పై ఫొటోలో మెగాస్టార్ తో పాటు స్టెప్పులేస్తున్న ఆ యంగ్ హీరోయిన్  ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా సోషల్ మీడియాతో పాపులర్ అయ్యి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఆమె ఎవరంటే..

రీసెంట్ డేస్ లో బాగా పాపులర్ అయిన భామల్లో రమ్య పసుపులేటి ఒకరు. హుషారు సినిమాతో ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది. ఈమధ్య మెయిన్ హీరోయిన్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే అనే సినిమాలో మెరిసింది. అందం, అభినయంతో ఈ చిన్నది కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. విశ్వంభర సినిమాలో రమ్య మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. తాజాగా విడుదలైన సాంగ్ లో మెగాస్టార్ పక్కన డాన్స్ చేసింది రమ్య. ఈ సినిమా తర్వాత ఈ చిన్నదాని క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..