కాజల్  అగర్వాల్‌కు కలిసిరాని సెకండ్ ఇన్నింగ్స్.. 

1 January 2026

Pic credit - Instagram

Rajeev 

 తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్ కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. 

తర్వాత ఒక్కో సినిమాతో విజయాన్ని అందుకుంటూ తన క్రేజ్ మరింత పెంచుకుంటూ వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. 

 ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది. తక్కువ సమయంలోనే నటిగా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. 

 కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ తీసుకుంది.

పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ కంబ్యాక్ ఇవ్వలేకపోయింది 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాతోనే బిజీగా గడుపుతుంది. క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.