Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అయ్య బాబోయ్.. భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం!

కెనడాలో చిత్రమైన రంగురంగుల లైట్లు కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది UFO అని అనుమానిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్, కెనడాలో అన్‌ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా (UAPs) గుర్తించబడ్డాయి. గ్రహాంతర జీవుల ఉనికి గురించి చర్చ జరుగుతోంది, అయితే శాస్త్రవేత్తల విశ్లేషణ అవసరం.

Video: అయ్య బాబోయ్.. భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం!
Alien In Canada And America
Follow us
SN Pasha

|

Updated on: Apr 16, 2025 | 4:38 PM

భూమి లాంటి మరో గ్రహం, మనుషులను పోలిన జీవులు.. ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట ఉన్నారని చాలా మంది నమ్ముతారు. కొంతమంది శాస్త్రవేత్తలైతే కొన్నేళ్లుగా ఏలియన్స్‌ను వెతికేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఏలియన్స్‌ జాడ కనిపెట్టి వారితో మైత్రి చేసుకోవాలని మనిషి భావిస్తున్నాడు. ఏళ్ల నుంచి వంద ప్రయోగాలు జరుగుతున్నా.. ఇప్పటి వరకు ఏలియన్స్‌ ఉన్నారు అనే ఒక స్పష్టమైన ఆధారం అయితే దొరకలేదు. కానీ, తాజాగా ఓ వీడియో అయితే ఏలియన్స్‌ ఉన్నారు.. మన భూమికి దగ్గరగా తిరుగుతున్నారు అని అనిపించే ఓ వీడియో అయితే వైరల్‌ అవుతోంది. కెనడాలో రాత్రిపూట ఆకాశంలో మర్మమైన, రంగురంగుల లైట్లు మెరుస్తూ కనిపించిన తర్వాత, ఒక వింతైన UFO(గుర్తుతేలియని వాహనం)కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.

యునైటెడ్ స్టేట్స్, కెనడా దేశాల్లో UAPS (అన్‌ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా)లను గుర్తించారు. వివిధ రకాల రంగులు, అసాధారణ కదలికలను ప్రదర్శించే లైట్లు వీడియోలో కనిపిస్తున్నాయి. ఇవి కచ్చితంగా గ్రహాంతరవాసులు అని చాలా మంది అంటున్నారు. గ్రహాంతర జీవుల గురించి చాలా మంది సందేహాస్పదంగా ఉన్నప్పటికీ, ఈ వీడియోలు ఆకాశంలో గ్రహాంతరవాసుల ఉనికి గురించి చర్చలకు దారి తీశాయి. అయితే వీటిని పరిశీలించి శాస్త్రవేత్తలు అవేంటో ఒక క్లారిటీ ఇస్తే కానీ.. ఏలియన్స్‌ గురించి ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది. అలాగే ఆ రంగుల లైట్లు ఏంటో కూడా తెలిసిపోతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.