కీర దోసకాయ రుచినే కాదు శరీరానికి కావాల్సిన పోషకాల్నీ పుష్కలంగా అందిస్తుంది. దీన్లో కొవ్వు శాతం చాలా తక్కువ. చర్మానికి మేలు చేసే విటమిన్ సి, కెఫియక్ యాసిడ్ లాంటివి ఎక్కువగా ఉంటాయి
TV9 Telugu
దీని తొక్కులో పీచు పదార్థంతోపాటు ఉండే సిలికా, మెగ్నీషియం, పొటాషియం... లాంటి ఖనిజలవణాలు కండరాలు, ఎముకలు, కణజాలాల అభివృద్ధికి మేలు చేస్తాయి
TV9 Telugu
కీరలో 95 శాతం నీరు, ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, విటమిన్ ఎ, కె, సి, బి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి
TV9 Telugu
అందుకే కీరని వేసవిలో సూపర్ ఫుడ్ అంటారు. చాలా మంది దీనిని సలాడ్‌గా తినడానికి ఇష్టపడతారు. అయితే కీర తొక్క తీసి తీసి తినాలా, తీయకుండా తినాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది
TV9 Telugu
ఈ రెండు పద్ధతుల్లో కీర తొక్క తీయకుండా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే తొక్కలో ఫైబర్‌తో పాటు అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి
TV9 Telugu
అయితే తొక్కతో తినడానికి ముందు, దానిని శుభ్రంగా సరిగ్గా కడగాలి. 10 నుంచి 15 నిమిషాలపాటు ఉప్పు నీటిలో నానబెడితే వీటిపై ఉన్న మురికి, పురుగుమందులు తొలగిపోతాయి
TV9 Telugu
కీర జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగులకు ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
కీరదోసలో 95 శాతం నీరు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది