AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Tips: స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్..!

వేసవి కాలం నేపథ్యంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు పెరిగిపోయాయి. వీటి కారణంగా ప్రజలకే కాదు, స్మార్ట్ ఫోన్లకు కూడా అనేక అనర్థాలు కలుగుతాయి. వీటిలో ఫోన్ వేడెక్కిపోవడం అనే సమస్య అందరినీ కామన్ గా వేధిస్తుంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ మెరుగ్గా పనిచేస్తుంది. సాధారణంగా కంటే మీ ఫోన్ ఎక్కువ వేడిక్కితే పాటించాల్సిన చిట్కాలను తెలుసుకుందాం.

Smartphone Tips: స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్..!
Smart Phone Heat Tips
Follow us
Srinu

|

Updated on: Apr 16, 2025 | 3:45 PM

స్మార్ట్ ఫోన్లు పనిచేసేటప్పుడు వేడిని ఉత్పత్తి చేస్తాయి. అది పరిమితికి మించి ఎక్కువ ఉంటే జాగ్రత్త పడాలి. సూర్యుడి నుంచి ఎండ డైరెక్టుగా ఫోన్ పై పడడం, వేడి వాతావరణం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఎక్కువ యాప్ లు వినియోగించడం, వీడియోలు వీక్షించడం, ఎక్కువ సమయం గేమ్ లు ఆటడం వల్ల కూడా ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. హానికరమైన సాఫ్ట్ వేర్ లు, అప్ డేట్లు చేసుకోకపోవడం కూడా కారణమవ్వొచ్చు.

సింపుల్ చిట్కాలు

  • సూర్యుడి కాంతి డైరెక్టుగా ఫోన్ మీద పడకుండా చూసుకోవాలి. బయట తిరిగే సమయంలో, బీచ్ లో ఉన్నప్పుడు ఫోన్ పై చిన్న క్లాత్ కప్పాలి. లేకపోతే నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి.
  • వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది. పార్కు చేసిన కార్లలో సెల్ ఫోన్ ఉంచకూడదు. కారు లోపల పెరిగిన ఉష్ణోగ్రతతో ఫోన్ కు ఇబ్బంది కలుగుతుంది.
  • ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ ను తగ్గించుకోవాలి. దీని వల్ల చార్జింగ్ తో పాటు వేడి ఉత్పత్తి తగ్గుతుంది. ఆటోమేటిక్ బ్రైట్ నెస్ సెట్టింగ్ లు చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది.
  • ఫోన్ లో ఎక్కువ యాప్ లు ఉంటే దాని ప్రభావం ప్రాసెసర్ పై పడుతుంది. తద్వారా వేడి ఎక్కువ విడుదల అవుతుంది. కాబట్టి అనవసర యాప్ లను మూసివేయాలి.
  • చాలామంది అందం కోసం ఫోన్ కు పౌచ్ లు, కవర్లు వాడుతుంటారు. వీటి వల్ల ఫోన్ లో విడులయ్యే వేడి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. మీ ఫోన్ వేడిగా అనిపిస్తే కవర్, పౌచ్ లను కొంత సేపు తీసేయండి.
  • కంపెనీ అందించిన చార్జర్లు, కేబుళ్లతోనే ఫోన్ కు చార్జింగ్ పెట్టాలి. అననుకూల చార్జర్లతో కూడా ఫోన్ వేడేక్కే అవకాశం ఉంది.
  • ఫోన్ ను వాడని సమయంలో బ్ల్యూటూత్, జీపీఎస్, ఇతర వాటిని ఆఫ్ చేయండి. దీని వల్ల ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
  • సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం వల్ల ఫోన్ పనితీరు వేగంగా ఉంటుంది.
  • ఎక్కువ సమయం గేములు ఆడుగున్నా, స్ట్రీమింగ్ చేస్తున్నా ప్రాసెసర్ వేడెక్కిపోతుంది. అది చల్లారడానికి కొంత విరామం ఇవ్వాలి.
  • ఫోన్ వేడిక్కేతే వెంటనే తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ చేయాలి. అది చల్లబడిన తర్వాత ఆన్ చేసుకోవాలి. పైన తెలిపిన చిట్కాలు పాటించినా మీ ఫోన్ వేడెక్కుతుంటే బ్యాటరీ పనిచేయకపోవడం, అంతర్గత సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి. వెంటనే టెక్నీషియన్ దగ్గరకు తీసుకువెళ్లాలి.

విజయనగరం గ్రామా దేవత.. అత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
విజయనగరం గ్రామా దేవత.. అత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!
ట్రంప్‌ జోక్స్‌తో బిత్తరపోయిన వాటికన్‌..! నేనే కొత్త పోప్‌ అంటూ
ట్రంప్‌ జోక్స్‌తో బిత్తరపోయిన వాటికన్‌..! నేనే కొత్త పోప్‌ అంటూ
పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..
పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..
13 ఏళ్లకే టాలీవుడ్ లవర్ బాయ్.. తెలుగు హీరో హరీష్ గుర్తున్నాడా.. ?
13 ఏళ్లకే టాలీవుడ్ లవర్ బాయ్.. తెలుగు హీరో హరీష్ గుర్తున్నాడా.. ?
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే, మరో జన్మ ఎత్తాల్సిందే
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే, మరో జన్మ ఎత్తాల్సిందే
రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇవి తింటే కడుపులో ఉన్న చెత్తంతా బయటికి పోతుంది..!
ఇవి తింటే కడుపులో ఉన్న చెత్తంతా బయటికి పోతుంది..!
సింహాచలం ఘటన దురదృష్టకరం.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ దిగ్ర్బాంతి..
సింహాచలం ఘటన దురదృష్టకరం.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ దిగ్ర్బాంతి..