ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఫలాల్లో దానిమ్మ ఒకటి. ఇది అనేక పోషకాలతో నిండి గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, రక్తపోటు నియంత్రణ, క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. ఫైబర్ కోసం గింజలను నేరుగా తినడం మంచిది. అయితే, ఊబకాయం, మధుమేహం ఉన్నవారు మోతాదులో తీసుకోవడం అవశ్యకం.