- Telugu News Photo Gallery Spiritual photos If you keep a rupee note under your pillow at night, you will get good luck.
నైట్ దిండు కింది రూపాయి బిళ్ళ ఉంచితే.. అదృష్టం వస్తుందట..
హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయట పడొచ్చని.. పండితులు చెబుతూ ఉంటారు. చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో చాలా దోషాలను తగ్గించుకోవచ్చు. సాధారణంగా నిద్ర పోయే సమయంలో మన దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి మీరు నిద్రపోయేటప్పుడు రూపాయిని కూడా పెట్టుకోండి. అదేంటి అనుకుంటున్నారా..
Updated on: Dec 19, 2025 | 12:59 PM

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయట పడొచ్చని.. పండితులు చెబుతూ ఉంటారు. చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో చాలా దోషాలను తగ్గించుకోవచ్చు.

సాధారణంగా నిద్ర పోయే సమయంలో మన దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి మీరు నిద్రపోయేటప్పుడు రూపాయిని కూడా పెట్టుకోండి. అదేంటి అనుకుంటున్నారా? వాస్తు శాస్త్రంలో రూపాయికి ఎంతో విలువ ఉంది. వాస్తు శాస్త్రంలో రూపాయి నాణెం రెమిడీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఒక రూపాయి నాణెం తీసుకుని ప్రతి నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకుని పడుకోండి. దీని వలన నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావం దూరమై.. పాజిటివ్ ఎనర్జీ పడుతుంది. అంతే కాకుండా అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి దూరం అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమై.. ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా ఉన్న చిక్కులు కూడా దూరమవుతాయి.

ఈ రెమిడీని ప్రతీ నెలా ఒక్కసారి చేయవచ్చు. రాత్రి పూట నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించాలి. తరువాతి రోజు ఆ నాణెంను పారే నది, చెరువు వంటి వాటిల్లో వదిలేయవచ్చు. ఇలా చేస్తే ధనలాభం కలుగుతుందని అంటున్నారు పండితులు.




