కొత్తగూడ అడవుల్లో కనిపించిన అనుకోని అతిధి.. దెబ్బకు వాహనాలు ఆపేసి.. ఏం చేశారంటే.?
Telangana: కొత్తగూడ అడువుల్లోకి అనుకోని అతిధి వచ్చింది. అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యి.. ఆగిపోయారు. తమ వాహనాలను నిలిపేసి.. ఆ అతిధిని ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ వీడియో ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

అడవి దున్నలకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని అడవులు కేరాఫ్‌గా మారాయి. ఈ అడవుల్లో అక్కడక్కడా ప్రత్యక్షం అవుతున్న అడవిదున్నలు ప్రజలను హడలెత్తి పోయేలా చేస్తున్నాయి. భారీకాయంతో తాజాగా రహదారిపై ప్రత్యక్షమైన అడవిదున్నను చూసి బాటసారులు ఆందోళనకు గురయ్యారు. అది రోడ్ క్రాస్ చేస్తుండగా వీడియో చిత్రీకరించి వైరల్ చేశారు. కొత్తగూడ మండలంలోని ముస్మీ-కర్ణగండి రహదారిపై భారీ అడవి దున్న ప్రత్యక్షమయింది. అడవిదున్నను చూసి ఆ మార్గంలో వెళ్తున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!
కొంత సేపు కారులోనే కూర్చొని అడవి దున్న కదలికలను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అడవి దున్న రోడ్డు దాటుతూ కనిపించింది. నెలరోజుల వ్యవధిలో మూడోసారి అడవి దున్నల ప్రత్యక్షం కలకలం రేపింది. ఈ అడవుల్లో అడవి దున్నలు పెద్ద సంఖ్యలో ఉండే ఉంటాయని అంతా భావిస్తున్నారు. వాటి జోలికి వెళ్తే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండడంతో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాటి జోలికి వెళ్ళవద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








