Jaggery: వీరికి బెల్లం విషంతో సమానం.. తిన్నారంటే కొబ్బరిబొండంలా మారాల్సిందే
బెల్లం సహజమైన పోషకాలతో కూడిన సూపర్ ఫుడ్. జీర్ణక్రియను మెరుగుపరచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే తేమ వల్ల పాడైపోతుంది, బూజు పడుతుంది. బెల్లాన్ని గాలి రాని కంటైనర్‌లో ఉంచాలి. అధికంగా తీసుకుంటే బరువు పెరిగి, కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

బెల్లంలో సహజమైన పోషకాలు ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్‌తో పాటు ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు లాంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. బెల్లం కేవలం తీపిని అందించే పదార్థం మాత్రమే కాదు, దీనిని ఒక సూపర్ ఫుడ్‌గా అంటారు. ప్రాసెస్ చేసిన చక్కెరతో పోలిస్తే, బెల్లం సహజమైన తీపిని కలిగి ఉండటం వల్ల శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. మరి అసలు బెల్లాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచోచ్చా.. లేదా.? సాధారణంగా బెల్లాన్ని ఫ్రిజ్‌లో ఎప్పుడూ పెట్టకూడదు. ఫ్రిజ్‌లో తేమ ఎక్కువగా ఉండటంతో బెల్లం నాణ్యత తగ్గి త్వరగా పాడవుతుంది. అంతేకాకుండా, బూజు పట్టే అవకాశాలు కూడా పెరుగుతాయి.
బెల్లాన్ని వంటగదిలో గాలి రాని కంటైనర్‌లో ఉంచాలి. గాలి, తేమ లోపలికి రాకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే, పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ చేయడం ఉత్తమం, తద్వారా బెల్లం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. బెల్లం ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇది సహజ డీటాక్సిఫైయర్‌గా పనిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం లాంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాలేయాన్ని శుద్ధి చేయడంలో కూడా తోడ్పడుతుంది. రాత్రి భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం చాలా మంచిదని వైద్యులు అంటుంటారు. బెల్లంలో ప్రోటీన్లు, మినరల్స్ ఉండటం వల్ల చక్కెరతో పోలిస్తే కాస్త నెమ్మదిగా జీర్ణం అవుతుంది. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయి కాస్త నిదానంగా పెరుగుతుంది.
అయితే, బెల్లం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బెల్లం, చక్కెరలో ఉండే క్యాలరీలలో పెద్దగా తేడా ఉండదు. చక్కెరైనా, బెల్లమైనా పరిమితికి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఎక్కువ బెల్లం తినడం వల్ల బరువు పెరుగుతుంది. బెల్లం ప్రోటీన్లు, కొవ్వుతో పాటు ఫ్రక్టోస్, గ్లూకోజ్‌తో నిండి ఉంటుంది. 100 గ్రాముల బెల్లం దాదాపు 383 క్యాలరీలు కలిగి ఉంటుంది. కాబట్టి బెల్లం తినే ముందు ఆలోచించాలి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు కూడా బెల్లం ఎక్కువగా తినకూడదు. లేదంటే ఈ కండిషన్ ఉన్నవారి ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. రక్తం గడ్డకట్టి గుండె, ఊపిరితిత్తులు, బోన్ మ్యారో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దంతక్షయం, పిప్పళ్ళు వంటి దంత సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు సైతం దీనిని అస్సలు తినకూడదు.




