AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటి ముందు ముగ్గు వేశారనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే గుండె పగులుద్ది

అదేవిధంగా పోలింగ్ స్టేషన్‌కు వెళ్ళే దారిలో కూడా పోలింగ్ స్టేషన్ ముందు కూడా తెల్ల ఆవాలు చల్లారు బిజెపి అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు తెల్ల ఆవాలు చల్లడంతో వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ భయాందోళనకు గురి కావడంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వివరాలు ఇలా..

Telangana: ఇంటి ముందు ముగ్గు వేశారనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే గుండె పగులుద్ది
Telangana
Ravi Kiran
|

Updated on: Dec 16, 2025 | 1:37 PM

Share

మొన్న ఖమ్మంలో.. ఇవాళ మక్తల్‌లో..! పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజల్ని కూడా నమ్ముకుంటున్నారు కొందరు. ప్రత్యర్థులు ఓడిపోవాలంటూ.. ఓం భీమ్‌ బుష్‌ అంటూ.. ఏవేవో పూజలు చేస్తున్నారు. రేపు తుది విడత ఎన్నికలు అనగా మక్తల్‌ సమీపంలో జరిగిన ఘటన పెద్ద కలకలాన్నే రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం కాచ్వార్‌లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌ వేళ క్షుద్ర పూజల కలకలం రేగింది. బీజేపీ బలపరచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు అర్థరాత్రి క్షుద్రపూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. తెల్ల ఆవాలు, పసుపు, ఇంకా మరికొన్ని రకాల వస్తువులు ఏవో చల్లి పూజలు చేశారంటోంది వెంకటమ్మ కుటుంబం. ఉదయాన్నే ఇంటిముందు ఇలాంటి దృశ్యం చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్రపూజలతో కీడు తప్పదనే భయంతో వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్‌ అయితే అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఇదంతా కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి బంధువులపనే అంటున్నారు వెంకటమ్మ. సీసీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఇదంతా కాంగ్రెస్ మద్దతుదారు రేణుక మామ అయిన రాములు చేసినట్టుగా నిర్థారణకు వచ్చారు. ఆయన కూడా దీన్ని ఒప్పుకున్నాడని చెప్తున్నారు. పోలింగ్‌ స్టేషన్ ముందు కూడా ఇదే రకంగా రాములు పూజలు చేశాడని చెప్తున్నారు. ఎలక్షన్‌ టైమ్‌లో ఈ క్షుద్రపూజల ఎపిసోడ్‌ ఊళ్లో పెద్ద టెన్షన్‌ వాతావరణాన్నే సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే