AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లచ్చిందేవి ఊరికే కరుణిస్తుందా.? రూ. 10 వేలు కడితే రూ. 13 లక్షలు వచ్చాయ్.. ఇప్పుడిదే ట్రెండింగ్

లాభాలు ఎవరు కోరుకోరు. కానీ దానికంటూ తగిన మూల్యం చెల్లించకూడదు. సరైన ఐడియా, ప్రణాళికలతో అధిక రాబడులు సంపాదించుకోవాలి. మరి అలాంటి ఓ ఐడియా ఇప్పుడు మీకోసం తీసుకొచ్చాం. మీరు ఇందులో అప్పుడు రూ. 10 వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే..

లచ్చిందేవి ఊరికే కరుణిస్తుందా.? రూ. 10 వేలు కడితే రూ. 13 లక్షలు వచ్చాయ్.. ఇప్పుడిదే ట్రెండింగ్
Money
Ravi Kiran
|

Updated on: Dec 12, 2025 | 1:14 PM

Share

మనందరం చిన్నప్పుడు వైకుంఠపాళీ ఆడి ఉంటాం. సరిగ్గా అలాగే ఉంటుంది ఈ స్టాక్ మార్కెట్ కూడా. ఎప్పుడు పాములకు చిక్కుతామో.. ఎప్పుడు నిచ్చెన ఎక్కుతాయో ఎవ్వరికీ తెలియదు. కానీ మనం రీసెర్చ్ చేసుకుని.. తీసుకునే ఓ మంచి స్టాక్.. కచ్చితంగా ఫ్యూచర్‌లో లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు. రిలయన్స్, బ్రిటానియా, JSW స్టీల్.. ఇలా ఒకటేమిటి చాలానే ఉన్నాయి. ఫండ్స్ మాదిరిగా కాదు.. స్కీమ్స్‌లా అస్సలు అక్కర్లేదు. ఒక్కసారి ఇలాంటి స్టాక్స్‌లో గంపెడంత డబ్బును తీసుకెళ్లి పెడితే.. అవే లక్షలు తెచ్చిపెడుతుంది. మరి అలాంటి ఓ స్టాక్ ఇప్పుడు తెలుసుకుందామా..

బజాజ్ ఫైనాన్స్.. మంచి చరిత్ర ఉన్న ఈ కంపెనీ గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. సుమారు 1995వ సంవత్సరంలో అనుకుంట.. ఈ స్టాక్ దాదాపుగా రూ. 7.55 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఆ సమయంలో మీరు కేవలం రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి ఉంటే.. అది అంచలంచలుగా.. ఇప్పుడు అనగా డిసెంబర్ 11న రూ. 13.38 లక్షలు మీ సొంతం అవుతుంది. సుమారు 30 సంవత్సరాల టైం పిరియడ్‌లో ఈ షేర్ 13281.5 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఒకానొక సమయంలో ఈ స్టాక్ ఆల్ టైం హై రూ. 9260కి చేరుకుంది. అయితే ఆ తర్వాత స్టాక్ స్ప్లిట్, బోనస్ వల్ల ఇప్పుడు రూ. వెయ్యి దగ్గర ట్రేడ్ అవుతోంది. డిసెంబర్ 11న ఇది రూ. 1061 దగ్గర డేహైకి చేరుకుంది.

అవునా.! అయితే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా అని మీరు అనుకోవచ్చు. అయితే ఓ ఉదాహరణ చెబుతా.. 2020లో కరోనా వచ్చింది. 2021లో ఈ షేర్ రూ. 6887 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఆ సమయంలో మీరు రూ. 10 వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ మొత్తం కాస్తా రూ. 1,466కి చేరుకుంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడూ సహనం, ఓపిక రెండూ ఉండాలి. సరైన సమయం చూసుకోవాలి. అలాగే కంపెనీల ఆదాయం, లాభాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కంపెనీ న్యూస్ ఎప్పుడూ చదువుతుండాలి. కాగా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి బిజినెస్ నిపుణుల సలహాలు తప్పక తీసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి