Actress: ఆ ఇద్దరు హీరోలతో బిడ్డను కనాలనుకున్నా.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్
సీనియర్ నటి జయలలిత తన జీవితంలో ఎదుర్కున్న ఇబ్బందులు, ఒడిదుడుకులను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నటుడు శరత్ బాబుతో తనకున్న అనుబంధంపై కూడా క్లారిటీ ఇచ్చింది. మరి ఆమె చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

టాలీవుడ్ సీనియర్ నటి జయలలిత తన జీవితంలో ఎదుర్కున్న ఇబ్బందులు, కష్టాల గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన ఇల్లు తనకొక దేవాలయం అని.. ఇంటికి వచ్చిన ప్రతీసారి ఓ ఆధ్యాత్మిక అనుభూతి వస్తుందని తెలిపింది. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని.. కొందరు నుంచి తప్పించుకోగలిగినా.. మరికొందరు నుంచి తప్పించుకోలేకపోయానని పేర్కొంది. అలాగే తన భర్త తనను ఓ అంబాసిడర్ కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపాలనుకున్నాడన్న నిజాన్ని సైతం చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది నటి జయలలిత. ఆ సమయంలో పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు తనను కాపాడారని తెలిపింది. విడాకుల తర్వాత శారీరికంగా కృంగిపోయాను. ఆ సమయంలో తన భర్త నెలకు కేవలం రూ. 5 వేలు మెడిసిన్ ఖర్చులకు మాత్రమే ఇచ్చేవాడు. సినిమా ఆఫర్లు కూడా ఏమి రాలేదు.
‘నా తల్లిదండ్రులు, అత్తమామలు నన్ను ఓ ఏటీఎం మెషిన్‌లా చూశారు. సంపాదన కోసమే నన్ను అభిమానించేవారు. నా ఫస్ట్ మ్యారేజ్ ఒక సంవత్సరం కూడా నిలవలేదు. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఆ సమయంలో 50 సవర్ల బంగారం, రూ. 25 లక్షలు కోల్పోయాను’ అని నటి చెప్పింది. ఆ సమయంలో ఆస్తులు పోగుచేసుకోవాలనే దృష్టి తనకు లేదని.. అందుకేనేమో సర్వస్వం కోల్పోయానని తెలిపింది. 90sలో విడాకుల తర్వాత ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నా.. ఇక తల్లిదండ్రులు చనిపోయాక హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యానని జయలలిత తెలిపింది.
దివంగత నటుడు శరత్‌బాబుతో తనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని నటి పేర్కొంది. ఆయనతో కలిసి అనేక ఆధ్యాత్మిక యాత్రలు చేశానని, పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కనాలని కూడా అనుకున్నట్టు తెలిపింది. అయితే, శరత్ బాబు కుటుంబ సభ్యుల జోక్యంతో ఆ వివాహం జరగలేదని వెల్లడించింది. కమల్ హసన్‌తో కూడా ఇలాంటి ఆలోచనే వచ్చిందంది. ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన తాను.. ఇటీవల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ముక్తినాథ్ యాత్రకు నడిచి వెళ్లి.. నడిచి తిరిగి వచ్చానని.. దానితో తన భయాన్ని పోగొట్టుకున్నానని పేర్కొంది. ఒక సన్యాసి జీవితం, ఒక మహారాణి జీవితం రెండింటినీ తాను అనుభవించానని.. భగవంతుడిచ్చిన కష్టాలను భరించే శక్తిని ఇవ్వమని ఆయన్ని కోరుకుంటానని నటి జయలలిత తెలిపింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..








