Avatar 3: అవతార్ 3 సినిమాకు మునుపటి క్రేజ్ ఉందా ? ఇండియా లో బిజినెస్ ఎలా ఉందంటే
అవతార్ 3 విడుదలకు సిద్ధమవుతున్నా, ఇండియాలో గత చిత్రాల స్థాయిలో క్రేజ్ కనిపించడం లేదు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం "ఫైర్ అండ్ ఆష్" నేపథ్యంలో వస్తుంది. ఒమక్టయా, మెట్కైనా తెగలను పరిచయం చేస్తుంది. పార్ట్ 3 ప్రపంచవ్యాప్తంగా ₹20 వేల కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వస్తున్నప్పటికీ, ఇండియాలో ₹250 కోట్ల బిజినెస్ అంచనాలతో, హైప్ సృష్టించడం సవాలే.
అవతార్ 3 సినిమాకు నిజంగానే అంత క్రేజ్ ఉందా..? మనం మాట్లాడుకునేది వరల్డ్ వైడ్‌గా కాదు ఇండియాలో మాత్రమే..! ఎందుకంటే అప్పట్లో అవతార్ 1,2 వచ్చినపుడు రెండు వారాల ముందే వైబ్రేషన్స్ ఉన్నాయి. కానీ ఈసారి అవేం కనిపించట్లేదు. అసలు ఈ సారి అవతార్ ఎలా ఉండబోతుంది..? బిజినెస్ రేంజ్ ఎంత..? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత..? జేమ్స్ కామెరూన్‌కు భాషతో పనిలేదు.. దేశంతో అవసరం లేదు.. పేరుకు హాలీవుడ్ అయినా.. అన్నిచోట్లా రప్ఫాడిస్తుంటాయి ఆయన సినిమాలు. టైటానిక్, అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి. డిసెంబర్ 19కి అవతార్ 3తో రాబోతున్నారు జేమ్స్. మూడేళ్ళ కింద వచ్చిన అవతార్ 2 ఇండియాలో 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తీసేది హాలీవుడ్ బొమ్మే అయినా.. ఇండియాలోనూ అదే క్రేజ్ ఉంటాయి కెమరూన్ సినిమాలకు. పంచ భూతాలే అవతార్ కథకు స్పూర్థి అని అర్థమవుతుంది. మొదటి భాగాన్ని నేల మీద.. రెండో భాగాన్ని నీళ్ళలో తీసిన జేమ్స్ కేమెరూన్.. మూడో భాగం ఫైర్ నేపథ్యంలో తీసారు. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ ఆష్ టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కైనా అనే రెండు కొత్త తెగలను పరిచయం చేస్తున్నారిందులో. 2009లోనే 13500 కోట్లు వసూలు చేసింది అవతార్.. ఇక 2022లో 12500 కోట్లు కొల్లగొట్టింది అవతార్ 2. తాజాగా పార్ట్ 3 టార్గెట్ 20 వేల కోట్లు. ఇప్పుడున్న డాలర్ వ్యాల్యూకు ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ 3కి కష్టమే. భారత్ లోనూ 250 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. కాకపోతే ముందులా క్రేజ్ అయితే కనిపించట్లేదు. విడుదలకు ఇంకా 10 రోజులుంది.. ఆలోపు ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్ షాక్
ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ
షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్ !! ఇక వీరికి దబిడి దిబిడే
ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె మనదే..
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా..
ఆవు పాలు తాగి... ఆస్పత్రికి క్యూకట్టిన జనం.. ఏం జరిగిందంటే
లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ
