ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేదల కోసం ఉచిత LPG కనెక్షన్లను అందిస్తుంది. అర్హులైన మహిళలు రూ.550కే సిలిండర్లను, ఇతర వస్తువులను సబ్సిడీపై పొందవచ్చు. 18 ఏళ్లు పైబడిన బీపీఎల్ మహిళలు ఆధార్, రేషన్ కార్డులతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సులభమైన దరఖాస్తు ప్రక్రియ ద్వారా గృహిణులు వంటగ్యాస్‌ను పొందడం దీని లక్ష్యం.
ప్రతీ ఇంట్లో వంటగ్యాస్ అనేది నిత్యావసరం. వంటగ్యాస్ లేనిది వంటిట్లో ఏ పని కూడా ముందుకు కదలదు. వీటి ధరలు కూడా సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు తక్కువ ధరకు వంట గ్యాస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోంది. పేద కుటుంబాలు కూడా వంట గ్యాస్ ఉపయోగించాలనే ఉద్దేశంతో కేంద్రం 2016 మే1న ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అందిస్తున్నారు. అలాగే వీరికి రూ.550కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నారు. ఇలా ఏడాదికి 12 సిలిండర్ల వరకు వరకు సబ్సిడీపై ఇస్తున్నారు. అలాగే ఇతర వస్తువులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా 12 కోట్లకు పైగా ప్రజలు లబ్ది పొందుతున్నారు. మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. మహిళ భారత పౌరురాలై ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. ఇక పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్, అంత్యోదయ అన్న యోజన లబ్దిదారులుగా ఉండాలి. ఇక షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందినవారై ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సమర్పించాల్సి ఉంటుంది. ఉజ్వల యోజన వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఉజ్వల యోజన 2.0 కనెక్షన్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేసి -ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా కనెక్షన్ పొందాలనుకుంటున్నారో ఆ కంపెనీ పేరును ఎంచుకోవాలి. మీ పేరు, మొబైల్, ఈమెయిల్ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ కావాలి. రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్, ఏజెన్సీ పేరును ఎంచుకుని కేవైసీ కంప్లీట్ చేయాలి. అలాగే, రేషన్ కార్డు, కుటుంబసభ్యులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుని మీరు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీని కలిస్తే మీకు గ్యాస్ సిలిండర్ కేటాయిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్ నుంచి ఇంటికే కూరగాయలు
జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్.. టెన్షన్..
ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె మనదే.. గిన్నిస్‌లోకి 3 అడుగుల రాధ
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతది
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

