విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతది
బడికి సక్రమంగా హాజరుకాని ఓ విద్యార్థిని తిరిగి పాఠశాలకు రప్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిమ్మలగూడెంలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. విద్యార్థి ఇంటి ముందు ధర్నా నిర్వహించి విద్యాహక్కు ప్రాముఖ్యతను తెలియజేశారు. తల్లిదండ్రులు తమ కుమారుడిని బడికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఇది విద్యా ప్రచారం పట్ల ఉపాధ్యాయుల నిబద్ధతను చాటుతుంది.
బడికి సక్రమంగా హాజరు కాని ఓ విద్యార్థిని తిరిగి పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా ఆ విద్యార్థి ఇంటి ముందే ధర్నా నిర్వహించారు. ఈ ఆసక్తికర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో శనివారం జరిగింది. నిమ్మలగూడెం గిరిజన పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నక్క మనోవరుణ్ అనే బాలుడు 4వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా అతడు బడికి సరిగా రావడం లేదు. వచ్చినా ఉపాధ్యాయుల కళ్లుగప్పి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయుడు రవి, ఉపాధ్యాయురాలు రుక్మిణి పలుమార్లు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, కౌన్సెలింగ్ నిర్వహించినా వారిలో మార్పు రాలేదు. దీంతో ఉపాధ్యాయులు తోటి విద్యార్థులతో కలిసి శనివారం మనోవరుణ్ ఇంటి ముందు శాంతియుతంగా నిరసన చేసారు. ప్రతి చిన్నారి విద్యా హక్కును కాపాడటం, ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేలా చూడటం తమ బాధ్యత అని, ఆ విషయం తెలియజేయడానికే ఇలా చేశామని హెచ్‌ఎం రవి తెలిపారు.ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల నిరసనతో బాలుడి తల్లిదండ్రులు స్పందించారు. సోమవారం నుంచి తమ కుమారుడిని తప్పనిసరిగా బడికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆవు పాలు తాగి… ఆస్పత్రికి క్యూకట్టిన జనం.. ఏం జరిగిందంటే
ఇస్రో యువ శాస్త్రవేత్తగా కోనసీమ కుర్రాడు
లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ
డ్రీమర్స్‌కు గ్రీన్‌కార్డు! చిన్న పిల్లలుగా వలస వెళ్లిన వారికి శుభవార్త!
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా..
ఆవు పాలు తాగి... ఆస్పత్రికి క్యూకట్టిన జనం.. ఏం జరిగిందంటే
లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ
తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువు.. లాక్కెళ్లిన తోడేలు
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి

