AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవు పాలు తాగి... ఆస్పత్రికి క్యూకట్టిన జనం.. ఏం జరిగిందంటే

ఆవు పాలు తాగి… ఆస్పత్రికి క్యూకట్టిన జనం.. ఏం జరిగిందంటే

Phani CH
|

Updated on: Dec 11, 2025 | 12:57 PM

Share

ఆవుకు రేబిస్ సోకి మరణించడంతో, దాని పాలు, పంచామృతం సేవించిన పశ్చిమ బెంగాల్ గ్రామస్తులు భయపడ్డారు. రేబిస్ పాల ద్వారా వ్యాపించదని వైద్యులు చెప్పినా వినకుండా, పెద్ద సంఖ్యలో యాంటీ-రేబిస్ టీకా కోసం క్యూ కట్టారు. దీంతో 222 మందికి తొలి డోసు టీకా వేశారు. ఇది ప్రజారోగ్యంపై రేబిస్ భయాన్ని హైలైట్ చేస్తుంది.

ఒక వ్యక్తికి చెందిన ఆవు రేబిస్‌ సోకి మరణించింది. అయితే ఆ ఆవు పాలతో తయారు చేసిన పంచామృతాన్ని పలువురు సేవించారు. ఆ ఆవు పాలను కూడా చాలామంది వినియోగించారు. దీంతో ఆందోళన చెందిన వారంతా టీకా కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్యూకట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పాషాంగ్ గ్రామానికి చెందిన హృషికేశ్ మైతి ఇంట్లో ఆవు ఉంది. గత గురువారం పౌర్ణిమ పూజ సందర్భంగా ఆయన ఇంట్లో ఆ ఆవు పాలతో ‘పంచామృతం’ తయారు చేశారు. స్థానికులకు ఆ ప్రసాదాన్ని పంపిణీ చేసారు. ఆ గ్రామంలో చాలామందికి ఆ ఆవుపాలను విక్రయించారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఆ ఆవును కుక్క కరిచింది. దీంతో గురువారం రాత్రి ఆవు అనారోగ్యంతో మరణించింది. రేబిస్ సోకడంతో ఆ ఆవు చనిపోయినట్లు పశువైద్యుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఆ ఆవు పాలతో ‘పంచామృతం’ చేసి సేవించిన హృషికేశ్‌ కుటుంబం ఆందోళన చెందింది. ఆ కుటుంబ సభ్యులంతా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్‌ టీకా తీసుకున్నారు. మరోవైపు పంచామృతం సేవించిన స్థానికులతోపాటు ఆ ఆవు పాలు వినియోగించిన గ్రామస్తులకు శనివారం ఈ విషయం తెలిసింది. దీంతో వారంతా ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో స్థానిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని, యాంటీ రేబిస్‌ టీకా కోసం క్యూకట్టారు. అయితే ఆవు పాల ద్వారా రేబిస్‌ సోకదని డాక్టర్లు, ఆరోగ్య అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. ముందు జాగ్రత్త కోసం తమకు టీకా వేయాలని గ్రామస్తులు పట్టబట్టారు. దీంతో సుమారు 222 మందికి తొలి డోసు టీకా వేశారు. గత నెలలో ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్ జిల్లాలోని గ్రామంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. రేబిస్‌తో ఆవు మరణించడంతో సుమారు 200 మంది గ్రామస్తులు యాంటీ రేబిస్‌ టీకా పొందారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇస్రో యువ శాస్త్రవేత్తగా కోనసీమ కుర్రాడు

లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ

డ్రీమర్స్‌కు గ్రీన్‌కార్డు! చిన్న పిల్లలుగా వలస వెళ్లిన వారికి శుభవార్త!

తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువు.. లాక్కెళ్లిన తోడేలు