లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ
హనుమకొండలో జ్వాలా స్వచ్ఛంద సంస్థ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వినూత్న ర్యాలీ నిర్వహించింది. లంచగొండి అధికారులను బిచ్చగాళ్లతో పోల్చుతూ, అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసింది. గత ఏడాది ఉమ్మడి వరంగల్‌లో 19 మంది అధికారులు ఏసీబీకి చిక్కి, కోట్లాది అక్రమాస్తులు బయటపడిన నేపథ్యంలో, ఈ ప్రదర్శన సమాజంలో ఆలోచన రేకెత్తించింది. అవినీతి అధికారులకు కనువిప్పు కలిగించడమే ఈ ర్యాలీ లక్ష్యం.
లంచాలు తీసుకునే అవినీతి అధికారులను బిచ్చగాళ్ళతో పోల్చుతూ హనుమకొండలో వినూత్న ర్యాలీని నిర్వహించారు. నగరంలోని బెగ్గర్స్ అందర్నీ ఒక్కచోటికి చేర్చి వారితో అవినీతి అధికారులకు కనువిప్పు కలిగేలా వినూత్న ప్రదర్శన చేపట్టారు. జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం లో చేపట్టిన ఈ ప్రదర్శన ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేసింది. కొందరు ప్రభుత్వ అధికారుల అవినీతికి అంతు లేకుండా పోతోంది. అవినీతి నిరోధక శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..లంచగొండులు మారడం లేదు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేయి తడపందే ఏ పనీ కాని పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన ఏడాది వ్యవధిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 19 మంది ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కారు. వీరిలో అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఉన్నారు. వాళ్ల లెవల్ కు తగ్గట్టు లంచాలు తీసుకుంటూ అడ్డంగా బుక్కై కటకటాల పాలయ్యారు. వాళ్ల ఇళ్లలో సోదాలు చేస్తే వివిధ రూపాల్లో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులు, కరెన్సీ కట్టలు లభ్యమయ్యాయి. తాజాగా హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో బయటపడ్డ డబ్బుల కట్టలు.. జనాన్ని నివ్వెరపోయేలా చేశాయి. అందుకే అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. జ్వాలా స్వచ్ఛంద సంస్థ.. ఒక వినూత్న ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. లంచాలు తీసుకునే అవినీతి అధికారుల కంటే పొట్ట కూటి కోసం బిచ్చం ఎత్తుకునే బిచ్చగాళ్ళు ఎంతో మేలని పిలుపునిస్తూ వినూత్న ప్రదర్శన చేపట్టారు. హనుమకొండ నగరంలో చేపట్టిన ఈ డిఫరెంట్ ర్యాలీని.. జనమంతా ఆసక్తిగా తిలకించారు. అవినీతిపరులకు కనువిప్పు కలిగేలా.. ఈ వినూత్న ర్యాలీ ఉందని జనం చర్చించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రీమర్స్‌కు గ్రీన్‌కార్డు! చిన్న పిల్లలుగా వలస వెళ్లిన వారికి శుభవార్త!
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

