ఇస్రో యువ శాస్త్రవేత్తగా కోనసీమ కుర్రాడు
అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కొప్పిశెట్టి దిలీప్ పట్టుదలకు నిదర్శనం. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి, ఉన్నత విద్యాభ్యాసం చేసి, మంచి ఉద్యోగాన్ని వదులుకుని, అనేకసార్లు గేట్ పరీక్షలు రాసి, 25 ఏళ్ల వయసులో ఇస్రో శాస్త్రవేత్తగా తన కలను నెరవేర్చుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన అకుంఠిత కృషి దిలీప్‌ను ఈ ఘన విజయం సాధించేలా చేశాయి.
పట్టుదల ఉండాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మరోసారి రుజవు చేశాడు కోనసీమ కుర్రాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడి పట్టుదలకి తోడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన కల నెరవేరి ఇస్రోలో శాస్త్రవేత్తగా నిలిచాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి దిలీప్. కొప్పిశెట్టి సత్తిరాజు,బాల భువనేశ్వరిల కుమారుడైన కొప్పిశెట్టి దిలీఫ్ రామచంద్రపురం లో ఓ ప్రైవేట్ స్కూలులో పదవ తరగతి చదివి 10/10 జి పి ఏ సాధించాడు. కాకినాడలో ఇంటర్ చదివిన దిలీప్ 97.2 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. తాడేపల్లి గూడెం NITలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ చదివి గోల్డ్ మెడల్ సాధించాడు. అనంతరం డిలైట్ ఐటి కన్సల్టెన్సీ కంపెనీలో 14 లక్షలు వార్షికజీతానికి ఉద్యోగం సంపాదించాడు. డిలైట్‌లో జాబ్ చేస్తూనే 2023 సంవత్సరంలో గేట్ పరీక్ష రాసి 542వ ర్యాంకు సాధించాడు. ఆ స్కోరు ద్వారా ఐదు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల్లో అర్హత సాధించాడు. అయినా దిలీప్ సంతృప్తి చెందలేదు. ఆ ఉద్యోగాలను సైతం వదులుకుని పట్టుదలతో తన లక్ష్యం వైపు ముందుకు సాగాడు. 2025లో మరోసారి గేట్ పరీక్ష రాసాడు. ఈసారి గేట్ ఫలితాల్లో ఆల్ ఇండియా 296వ ర్యాంకు సాధించాడు. తద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలో 22వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక ఇస్రో సంస్థలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. ఇరవై ఐదేళ్ల దిలీప్ యువ శాస్త్రవేత్తగా ఇస్రోలో అడుగు పెట్టడంతో తన కల నెరవేర్చుకున్నాడు. దిలీప్ పట్టుదలతో ప్రతిష్టాత్మకమైన ఇస్రో సంస్థలో సైంటిస్ట్ గా చేరడంతో పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ
డ్రీమర్స్‌కు గ్రీన్‌కార్డు! చిన్న పిల్లలుగా వలస వెళ్లిన వారికి శుభవార్త!
లంచగొండులకు తగిన గుణపాఠం.. వాళ్ళతో పోలుస్తూ.. వినూత్న ర్యాలీ
తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువు.. లాక్కెళ్లిన తోడేలు
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం

