AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే.. అబ్బా సాయి రామ్

12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే.. అబ్బా సాయి రామ్

Phani CH
|

Updated on: Dec 11, 2025 | 1:52 PM

Share

రాయ్‌పూర్‌-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది 12 గంటల ప్రయాణాన్ని 5 గంటలకు తగ్గిస్తుంది, దూరాన్ని 132 కి.మీ. కుదించి ఇంధన ఖర్చులను ఆదా చేస్తుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ, ఇది వాణిజ్యం, లాజిస్టిక్స్, రైతులకు భారీ ప్రయోజనాలను అందిస్తుంది. 2026 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

రాయ్‌పూర్‌-విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం 12 గంటలు కాగా అది ఇప్పుడు 5 గంటలకు తగ్గనుంది. అవును, రాయ్‌పూర్-విశాఖపట్నం మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, మూడు రాష్ట్రాల వాణిజ్య రూపురేఖలను మార్చేలా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే, 12 గంటల ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గనుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సాగే ఈ ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే.. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో పాటు సామాన్యులు, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రూ. 16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 465 కిలోమీటర్ల ఈ కారిడార్‌ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి-26 మార్గంలో 597 కిలోమీటర్ల దూరం ఉండగా, ఈ కొత్త మార్గం ద్వారా 132 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇది ఇంధన ఆదాతో పాటు రవాణా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ కారిడార్‌తో ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పరిశ్రమలు నేరుగా విశాఖపట్నం పోర్టుకు, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానమవుతాయి. తద్వారా ఎగుమతులు వేగవంతమై, లాజిస్టిక్స్ రంగం బలోపేతం అవుతుంది. ఈ ప్రాజెక్టు స్థానిక రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో తమ భూమి ఎకరం రూ. 15 లక్షలు పలికేదని, ఈ హైవే పనులు మొదలయ్యాక దాని విలువ రూ. 1.5 కోట్లకు చేరిందంటూ స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రక్కు యజమానులుకూడా గతంలో రాయ్‌పూర్ నుంచి విశాఖకు వెళ్లాలంటే ఒకటిన్నర రోజులు పట్టేదని, ఇప్పుడు పగలు బయలుదేరితే రాత్రికల్లా విశాఖ చేరుకోవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో డీజిల్ ఖర్చు, వాహనాల నిర్వహణ భారం తగ్గుతుందంటున్నారు. ఈ కారిడార్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీలోని మారుమూల, గిరిజన ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!

ప్రభుత్వం కొత్త యాప్.. రైతు బజార్‌ నుంచి ఇంటికే కూరగాయలు

జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఎప్పుడొచ్చి మీద పడుతుందో.. టెన్షన్‌.. టెన్షన్‌..

ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె మనదే.. గిన్నిస్‌లోకి 3 అడుగుల రాధ

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయులు ధర్నా.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతది