కాసులు కురిపిస్తున్న హారర్ సినిమాలు..
హారర్ థ్రిల్లర్ జోనర్ టాలీవుడ్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉన్నదే. కథ పాతదైనా, కథనం కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రభాస్ నుండి కొత్త హీరోల వరకు అందరూ ఈ జోనర్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఈషా, కిష్కింధపురి, ప్రభాస్ రాజా సాబ్, నాగ చైతన్య వృషకర్మ వంటి లేటెస్ట్ హారర్ సినిమాలు త్వరలో రానున్నాయి. ఈ ఎవర్ గ్రీన్ జోనర్ ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలుతోంది.
ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా వన్నె తరగని ఎవర్ గ్రీన్ జోనర్ హార్రర్ థ్రిల్లర్. కథ పాతగా ఉన్నా.. కథనం కొత్తగా ఉంటే చాలు ఆడియన్స్ బ్రేక్ ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అందుకే ఈ జోనర్ సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువే. తాజాగా ప్రభాస్ నుంచి కొత్త హీరోల వరకు అంతా అదే దారిలో నడుస్తున్నారు. మరి టాలీవుడ్ లేటెస్ట్ హార్రర్ సినిమాలేంటో చూద్దామా.. కార్తికేయలో నిఖిల్ చెప్పిన ఈ డైలాగ్‌నే మన హీరోలు ఫాలో అవుతున్నారిప్పుడు. అందుకే ఏ జోనర్ ఆగినా.. హార్రర్ మాత్రం ఆగదు. ఏడాదికి కనీసం ఓ 40 సినిమాలు ఈ జోనర్‌లో వస్తుంటాయి. తాజాగా ఈషా అనే మరో సినిమా కూడా ఇదే జోనర్‌లో వస్తుంది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి విజయాల తర్వాత బన్నీ వాస్, వంశీ నందిపాటి కలిసి రిలీజ్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈషా ట్రైలర్ విడుదలైందిప్పుడు. ఈ ట్రైలర్ చూస్తుంటే బన్నీ వాస్, వంశీ హ్యాట్రిక్ పూర్తి చేసేలాగే కనిపిస్తున్నారు. డిసెంబర్ 12న విడుదల కానుంది సినిమా. ఇక రాక్షసుడు తర్వాత హిట్ లేని బెల్లంకొండ శ్రీనివాస్‌కు చాలా కాలం తర్వాత హిట్టిచ్చింది హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన కిష్కింధపురి. తెలుగులో రీసెంట్‌గా ప్రేక్షకులను బాగా భయపెట్టిన సినిమా ఇది. రాజా సాబ్ కూడా హార్రర్ జోనరే. కాకపోతే తన మార్క్ కామెడీ మిక్స్ చేస్తున్నారు మారుతి. జనవరి 9న సంక్రాంతి కానుకగా వచ్చేస్తున్నాడు రాజా సాబ్. ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ హార్రర్ సినిమా ఇది. అలాగే నాగ చైతన్య, కార్తిక్ దండు వృషకర్మ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తుంది. విరూపాక్షతో భయపెట్టిన కార్తిక్ దండు.. చైతూతోనూ అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. మొత్తానికి హార్రర్ జోనర్ కలిసొస్తుందిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మల్టీప్లెక్స్ బిజినెస్.. మూడు పువ్వులు ఆరు కాయలు
Akhanda 2: అఖండ 2 ఈ వారమా..3 రోజుల్లో సాధ్యమేనా
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్లాన్ B.. ఉస్తాద్ తర్వాత రీ ఎంట్రీ
Gold Price Today: అయ్యో.. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది.. ఇవాళ తులం ఎంతంటే
స్క్రిప్ట్‌తో రండి, సినిమా పూర్తి చేసుకెళ్లండి.. సినిమావారికి CM ఆఫర్
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

