AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2: అఖండ 2 ఈ వారమా..3 రోజుల్లో సాధ్యమేనా

Akhanda 2: అఖండ 2 ఈ వారమా..3 రోజుల్లో సాధ్యమేనా

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Dec 10, 2025 | 4:39 PM

Share

అఖండ 2 సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది. డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు సవాళ్లుగా మారాయి. పంపిణీదారులు, అభిమానులు త్వరగా విడుదల చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇతర సినిమాల పోటీ, థియేటర్ల లభ్యత వంటి అంశాలను అధిగమించి, మేకర్స్ ఈ తేదీకి ఎలా చేరుకుంటారో చూడాలి.

అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు..? ఇండస్ట్రీ వర్గాల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్న ప్రశ్న ఇదే. ఓవైపు డిస్ట్రిబ్యూటర్లు.. మరోవైపు అభిమానులు.. ఇంకోవైపు నిర్మాతలు.. ఇలా ప్రతీ ఒక్కరు అఖండ 2ను వీలైనంత త్వరగా బయట పడేయాలని చూస్తున్నారు. మరి ఈ వారం అఖండ 2 వచ్చే అవకాశాలున్నాయా..? డిసెంబర్ 12 సాధ్యమవుతుందా..? అఖండ 2 సినిమా విడుదల తేదీపై చర్చలు మామూలుగా జరగట్లేదిప్పుడు. ఓ వైపు కోర్ట్ ఇష్యూలు.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు.. వీటన్నింటి నుంచి బయటకి వచ్చి డిసెంబర్ 12నే సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. లేటైతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి.. క్రేజ్ ఉన్నపుడే క్యాష్ చేసుకోవాలనే ప్రెజర్ నిర్మాతలపై బయ్యర్ల నుంచి బాగా వస్తుంది. డిసెంబర్ 5 డేట్ ఎలాగూ మిస్ అయిపోయింది.. దాంతో వీలైనంత త్వరగా విడుదల చేస్తే మంచిది అనే వాదన డిస్ట్రిబ్యూటర్ల నుంచి బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం బంతి కోర్టులో ఉంది.. అక్కడ్నుంచి క్లియరెన్స్ వస్తే ఈ వారమే అఖండ 2 విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు.. ఎందుకంటే దానికింకా 4 రోజులు కూడా లేదు. డిసెంబర్ 12న ఆల్రెడీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీతో పాటు.. బన్నీ వాస్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ఈషా.. కార్తి నటించిన అన్నగారు వస్తారు విడుదల కానున్నాయి. ఒకవేళ అఖండ 2 డిసెంబర్ 12న వస్తే వీటిలో కనీసం రెండు సినిమాలపై భారీ ప్రభావం తప్పకపోవచ్చు.. అది కూడా అఖండ 2 నిర్మాతలు ప్లాన్ చేసుకోవాలి. అన్నీ కుదిరి డిసెంబర్ 12న అఖండ 2ను విడుదల చేద్దామనుకున్నా.. మేకర్స్ ముందు చాలా సవాళ్లున్నాయి. ఈ మూడు రోజుల్లోనే ఓవర్సీస్ స్క్రీన్స్ తెచ్చుకోవాలి.. ఏపీ, తెలంగాణలో థియేటర్స్ బుక్ చేసుకోవాలి.. టికెట్ హైక్స్ కోసం మరోసారి ప్రభుత్వాల దగ్గరికి వెళ్లాలి.. ప్రీమియర్స్ ప్లాన్ చేయాలి.. వీటన్నింటికీ ఈ టైమ్ సరిపోతుందా..? చూద్దాం ఏం జరుగుతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్లాన్ B.. ఉస్తాద్ తర్వాత రీ ఎంట్రీ

Gold Price Today: అయ్యో.. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది.. ఇవాళ తులం ఎంతంటే

స్క్రిప్ట్‌తో రండి, సినిమా పూర్తి చేసుకెళ్లండి.. సినిమావారికి CM ఆఫర్

అఖండ-2 రిలీజ్‌ ఎఫెక్ట్‌.. బాధలోకి మోగ్లీ డైరెక్టర్

8 ఏళ్ల తరువాత హీరోయిన్‌పై లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి