AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్క్రిప్ట్‌తో రండి, సినిమా పూర్తి చేసుకెళ్లండి.. సినిమావారికి CM ఆఫర్

స్క్రిప్ట్‌తో రండి, సినిమా పూర్తి చేసుకెళ్లండి.. సినిమావారికి CM ఆఫర్

Phani CH
|

Updated on: Dec 10, 2025 | 3:45 PM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'గ్లోబల్ సమ్మిట్ 2025'లో సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో కొత్త స్టూడియోల ఏర్పాటుకు, సినిమా నిర్మాణాలకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. 24 క్రాఫ్ట్స్‌లో స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని చిత్ర ప్రముఖులను కోరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో చిరు, అజయ్‌తో పాటు ఇండస్ట్రీ పెద్దలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నటి జెనీలియా, అక్కినేని అమలతో పాటు పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి, ప్రోత్సాహానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమకు పలు కీలక హామీలు ఇచ్చారు. కేవలం స్క్రిప్ట్‌తో తెలంగాణకు వస్తే, సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా అన్ని రకాల సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభతరం చేస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాదు ఫ్యూచర్ సిటీలో కొత్త స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వివరించిన సీఎం, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా 24 క్రాఫ్ట్స్‌లో స్థానిక యువతకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సినీ ప్రముఖులను కోరారు. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అఖండ-2 రిలీజ్‌ ఎఫెక్ట్‌.. బాధలోకి మోగ్లీ డైరెక్టర్

8 ఏళ్ల తరువాత హీరోయిన్‌పై లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి

మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో

ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి

20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి