Electric XUV: 6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్.. ఒక్క చార్జ్‌తో 656 కిలోమీటర్లు.. ఈ రాకాసి కారు చూస్తే
డాష్‌బోర్డ్‌హైటెక్ ను కలిగిన మహీంద్రా XUV 9e మూడు-స్క్రీన్ కాక్‌పిట్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, విశాలమైన బూట్ స్పేస్, అదనపు ట్రంక్ స్పేస్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్లు డ్రైవర్, ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, అత్యాధునిక అనుభూతిని కలిగిస్తాయి. ఆ వివరాలు ఇలా..

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలోనే మహీంద్రా సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ SUV XUV 9eను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదొక రాకాసి కారు అని చెప్పొచ్చు. కేవలం 6.8 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగే సామర్ధ్యం దీని సొంతం. అలాగే ఈ కారు బ్యాటరీని చార్జ్ చేస్తే.. దాదాపుగా 20 నిమిషాల్లోనే 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అంటే..! ఫోన్ చార్జ్ కంటే తక్కువ సమయం అని చెప్పొచ్చు. ఇక ఒక ఫుల్ చార్జ్‌కు ఇది 656 కిలోమీటర్ల వరకు రయ్ రయ్‌మని వెళ్తుంది.
డిజైన్ విషయానికి వస్తే.. XUV 9eలో క్లోజ్డ్ గ్రిల్, కనెక్ట్ చేసే DRLలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, బోల్డ్ LED స్టైలింగ్ లాంటివి ఉన్నాయి. ఇవి చూపరులను భలేగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ABS(యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ESC(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఆధునిక సస్పెన్షన్ ఉన్నాయి. ఇవన్ని కూడా ఈ వాహనాన్ని పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ SUV మోడల్‌గా మారుస్తాయి.
డాష్‌బోర్డ్‌హైటెక్ ను కలిగిన మహీంద్రా XUV 9e మూడు-స్క్రీన్ కాక్‌పిట్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, విశాలమైన బూట్ స్పేస్, అదనపు ట్రంక్ స్పేస్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్లు డ్రైవర్, ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, అత్యాధునిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ వాహనం 59 kWh లేదా 79 kWh బ్యాటరీలతో నడుస్తుంది. అలాగే 282 bhp వరకు అవుట్‌పుట్‌ను జనరేట్ చేయగలదు. మహీంద్రా XUV 9e ఎక్స్-షోరూమ్ ధర రూ. 21 లక్షల నుంచి రూ. 31 లక్షల వరకు ఉంటుందని అంచనా. రూపాయల వరకు ఉంటుందని అంచనా. మహీంద్రా XUV 9e భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో ఒక బలమైన పోటీదారుగా నిలవనుంది.




