Income Tax Rules: రూ.20 వేల కంటే ఎక్కువ తీసుకున్నా ఫైన్.. త్వరలో ఇన్‌కమ్ ట్యాక్స్ షాకింగ్ రూల్స్..
విత్ డ్రాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. నగదు రూపంలో పెద్ద ట్రాన్సాక్షన్లు జరిగితే ఫైన్ వేయడంతో పాటు నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నిబంధనలు ఏంటి..? జరిమానా ఎంతరవకు ఉంటుంది? అనే వివరాల్లోకి వెళ్తే..

బ్లాక్ మనీని అడ్డుకునేందుకు, నగదు లావాదేవీలను మరింత పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ త్వరలో కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా నగదు లావాదేవీలపై కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురానుందని తెలుస్తోంది. వ్యక్తులు లేదా వ్యాపారులు, సంస్థలు నిర్వహించే లావాదేవీలపై మరింత నిఘా పెట్టనుంది. ఇక నుంచి లెక్కల్లో చూపిన నగదుకు భారీగా జరిమానాలు విధించనుందని సమాచారం. త్వరలో తీసుకురానున్న ఈ రూల్స్ గురించి ఇప్పుడు తెగ చర్చ నడుస్తోంది. ఈ నిబంధనలు ఏంటి..? అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది? అనే విషయాలు చూద్దాం.
ఇక నుంచి స్థారాస్తి కొనుగోళ్ల విక్రయం సమయంలో రూ.20 వేల కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే.. 100 శాతం వరకు భారీ జరిమానా విధించనున్నారు. ఇక ఒక వ్యక్తి నుంచి ఒకే రోజులో రూ.2 లక్షలకుపైగా నగదు రూపంలో అందుకుంటే ఫైన్ పడుతుంది. ఇక నగదు రూపంలో లోన్లు పొందటంపై పూర్తిగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నిషేధం విధించనుంది. ఇలా చేస్తే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఆన్‌లైన్, నగదు లావాదేవీలపై మరింత నిఘా పెట్టనున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ బ్యాంక్ నుంచి నగదు విత్ డ్రా చేస్తే.. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఇన్మరేషన్ వెళ్తుంది.
ఇక రూ.20 లక్షలకు మంచి విత్ డ్రా ట్రాన్సాక్షన్ జరిగితే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా తరచుగా మీ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో విత్ డ్రా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఆదాయపు పన్ను శాఖ నిఘాలోకి మీరు ఆటోమేటిక్‌గా వెళ్తారు. మీ మీద ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్స్ జరగొచ్చు. ఈ రూల్స్ నుంచి మీరు రక్షణ పొందాలంటే నగదు రూపంలో డబ్బులు స్వీకరించేటప్పుడు రసీదు పొందండి. అలాగే బ్యాంక్స్ ద్వారానే ట్రాన్సాక్షన్లు చేయడం మంచిది. త్వరలోనే ఈ రూల్స్ అమలు చేసే అవకాశముందని తెలుస్తోంది. బ్లాక్ మనీని నగదు రూపంలో కొంతమంది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ కఠిన నిర్ణయాలు ఉపయోగపడతాయనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ రూల్స్ బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక అమల్లోకి వచ్చాక ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది చూడాలి.




