Viral: పురాతన తవ్వకాల్లో దొరికిన అరుదైన మట్టి ముద్ద.. ఏంటని ఆరా తీయగా
సదరు మహిళ ఆస్థిపంజరం.. అప్పటి యువరాణిది అయి ఉంటుందని.. ఆమె తలపై ఉన్న కీరిటం ఆధిపత్యాన్ని సూచికగా నిలుస్తోందని.. దాని మధ్య భాగంలో 'సూర్యుని రూపంలో' పెద్ద రోసెట్ ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ కిరీటం తలక్రిందులుగా ఉండటానికి కారణం.. ఆ సమయంలో..

గ్రీస్‌కు చెందిన పలువురు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా.. వారికి సుమారు 2,700 సంవత్సరాల నాటి వింతైన తలక్రిందులుగా ఉన్న కిరీటం ధరించిన స్త్రీ అవశేషాలను కనుగొన్నారు. ఇక పురాతన అవశేషాలు దొరికిన ఆ ప్రాంతం పూర్వం శ్మశానవాటికగా ఉండేదని తెలుసుకున్నారు. ఆ అవశేషాలు 700 BC రెండవ అర్ధభాగం నాటివని తేల్చారు. తలపై తలక్రిందులుగా ఉన్న కిరీటం కలిగిన 20 నుంచి 30 ఏళ్ల మహిళ అవశేషాలు అవి.
సదరు మహిళ ఆస్థిపంజరం.. అప్పటి యువరాణిది అయి ఉంటుందని.. ఆమె తలపై ఉన్న కీరిటం ఆధిపత్యాన్ని సూచికగా నిలుస్తోందని.. దాని మధ్య భాగంలో ‘సూర్యుని రూపంలో’ పెద్ద రోసెట్ ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ కిరీటం తలక్రిందులుగా ఉండటానికి కారణం.. ఆ సమయంలో ఆమె ఏదైనా యుద్ధంలో ఓటమిని చవి చూసి ఉండొచ్చు. అంటే క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో ఆ మహిళ తన అధికారాన్ని కోల్పోయి ఉండొచ్చు. ఖననం చేసిన మహిళ చుట్టూ ఉన్న ప్రాంతం రాగి చెవిపోగులు, ఎముక, దంతపు పూసలు, అనేక కాంస్య నైవేద్యాలు లాంటివి ఉన్నాయి. 7వ శతాబ్దం మధ్యకాలంలో వంశపారంపర్య రాజ్యాలు ప్రజాదరణ కోల్పోవడం, కులీన వర్గాల అధీనంలోకి రావడం లాంటివి జరిగాయి. ఆ పరిస్థితులలో ఆమెను ఖననం చేసినట్టు ఉన్నారని పురావస్తు శాస్త్రవేత్తలు ఊహించారు.

