AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

Phani CH
|

Updated on: Dec 10, 2025 | 1:37 PM

Share

అన్నమయ్య జిల్లాలో వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. ఇటీవల రాయచోటిలో కుక్కల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. నడిచి వెళ్లాలన్నా, బైకులపై వెళ్లాలన్నా జనం భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ, వీధి కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. రోడ్డు మీద నడిచి వెళ్లాలన్నా, బైకులపై వెళ్లాలన్నా భయపడిపోతున్నారు జనాలు. నడిచి వెళ్తున్న వారినే కాదు, వాహనాలను సైతం వెంబడిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఉన్నట్లుండి నడిచి వెళ్లే వారిని కరవడం, వారిపై దాడి చేయడం, సడన్ గా బండిమీద వెళ్ళే వారి వెంట పడడం ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి బండిపై ఇంటికి వెళుతున్న వ్యక్తి వెంట కుక్కలు పడడం వాటినుంచి తప్పించబోయి బండిని స్పీడ్ గా నడపడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది. రాయచోటిలోని లక్ష్మీపురం లో నివాసం ఉండే ఫాజిల్ గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి 3 గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో తన ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డు పక్కన కొన్ని వీధికుక్కలు ఉన్నాయి. ఫాజిల్‌ తన దారిన తాను బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా ఆ వీధికుక్కలు వెంటబడ్డాయి. భయపడిన ఫాజిల్‌ వాటినుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని వేగంగా నడుపుతూ ఎదురుగా ఉన్న గుడిని బలంగా ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రాయచోటి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పట్టణంలో రోడ్లపై ఎక్కడికక్కడ కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని అనేకసార్లు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా ఎవరూ పట్టించుకోవడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మరో ప్రాణం బలి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2025లో గూగుల్‌ను ఊపేసిన టాప్ 10 సినిమాలివే

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా

చైనా అమ్మాయి వెడ్స్‌ ఝార్ఖండ్‌ అబ్బాయి.. వీరి అద్భుత ప్రేమ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

విచిత్ర వివాహం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి

సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది